
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం2 Karthika Deepam2. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ 766 లో దశరథ్ ని సునిత్ర పెళ్లి చేసుకోవడంతో అవమానం భరించలేకే తన భర్త కృష్ణమూర్తి ఆత్మహత్య చేసుకున్నాడని అందుకే తన కొడుకు సూరజ్ తో పగ తీర్చుకుంటున్నానని ఇన్నాళ్లూ ఫ్లాష్ బ్యాక్ చెప్పిన మాలిని.. అసలు నిజాన్ని తన భర్త ఫోటో ముందు బయటపెట్టింది. జరిగింది ఒకటైతే చెప్పింది మరొకటి అంటూ ఆరోజు ఏం జరిగిందో గుర్తు చేసుకుంది.
అసలు కథలో కాంచన కాళ్లు పోవడానికి కారణమైన యాక్సిడెంట్ ను చేయించింది మాలినినే. దశరథ్ చనిపోలేదని తెలిసి షాకైన కృష్ణమూర్తి నిలదీయగా తన అన్నయ్యను సుమిత్ర కాదని దశరథ్ ను పెళ్లి చేసుకుని తన తండ్రికి ఇచ్చిన మాటను తప్పిందని అందుకే దశరథ్ ను చంపి సుమిత్రను తీసుకొచ్చి తన అన్నయ్యకు ఇచ్చి పెళ్లి చేయాలని ప్లాన్ చేసినట్లు మాలిని ఒప్పుకుంది.
ఈ విషయం తన తండ్రికి చెప్తానన్న కృష్ణమూర్తిని మాలిని రివాల్వర్ తో బెదిరించింది. నా పరువు కంటే, పగ కంటే ప్రాణం ఎక్కువ కాదు.. సుమిత్రను కోడల్ని చేస్తానని మా నాన్నకు మాటిచ్చాను. నేను.. నా కడుపులో బిడ్డ చచ్చిపోతామని బ్లాక్ మెయిల్ చేసింది. పోలీసులు ఇంటికి వస్తున్నారని నిజం చెప్పి చెల్లెల్ని క్షమించమని అడుగుతానన్న కృష్ణమూర్తి, ఒకవైపు భార్య, కడుపులో బిడ్డ.. మరోవైపు చెల్లెలికి జరిగిన అన్యాయం మధ్య నలిగి ఎవరికి న్యాయం చేయాలి.. ఈ నరకం భరించలేనంటూ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
నువ్వు పిరికివాడివి, చెల్లెలి గురించి ఆలోచించి ఎవరికి న్యాయం చేయలేక చచ్చావ్.. నా పసుపు కుంకుమలు పోవడానికి సుమిత్ర మొండితనమే కారణం.. అందుకే ఆ ఫ్యామిలీని వదలను.. నా కొడుకును సిద్ధం చేసి జ్యోత్స్న వాడిని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోలేని పరిస్థితి తెచ్చానంటూ పగతో ఫోటోని చూస్తూ రగిలిపోతుంది మాలిని. మరోవైపు పెళ్లి ఆగిపోవడంతో సుమిత్రకు గుండెపోటు వచ్చి హాస్పిటల్ లో సీరియస్ కాగా శివన్నారాయణ మాత్రం దీనికి కారణం మాలిని, దక్షిణామూర్తిలను మళ్లీ తీసుకొచ్చిన దీప, కార్తీక్ లే అని నిందేసి.. మీరు మళ్లీ మాకు కనిపించొద్దంటూ దీప, కార్తీక్, కాంచన, శ్రీధర్ లను ఇంటి నుంచి బయటకు పంపించేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






