Home

»

Tv News

Illu Illalu Pillalu: శ్రీవల్లికి చుక్కలు చూపించిన ప్రేమ, నర్మద.. ఫోన్ కొట్టేసి అడ్డంగా బుక్కైపోయిందిగా!

Mar 29, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu Illalu Pillalu)'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-431 లో.. భాగ్యం వాళ్ళ ఇంట్లో ఆనందరావు, భాగ్యం సరదాగా ఉంటారు. భాగ్యంకి జడ వేస్తూ సరదాగా పాట పాడుతుంటాడు ఆనందరావు. భాగ్యం తనపై కోప్పడతుంది. అదే సమయంలో భాగ్యం తన కూతురి గురించి ఆలోచిస్తుంది. వెంటనే కూతురు శ్రీవల్లికి కాల్ చేస్తుంది భాగ్యం. అక్కడ అంతా సేఫేనా.. సైడ్ ఎఫెక్ట్ ఏం అయినా ఉందా అని భాగ్యం అడుగుతుంది. వాళ్ళిద్దరు నన్ను ఆడుకుంటుంటే నువ్వేదో పెద్ద డాక్టర్ అయినట్టు సేఫేనా, సైడ్ ఎఫెక్ట్స్ ఏం అయినా ఉన్నాయా అంటావేంటని భాగ్యంపై శ్రీవల్లి కోప్పడుతుంది.

సైడ్ ఎఫెక్ట్స్ అంటే నీ వొంట్లో కాదు.. ఆ ఇంట్లో.. మ్యాటర్ ఎవరికైనా లీక్ అయిందా అని దాని అని భాగ్యం అడుగుతుంది. లీక్ అవ్వడమేంటి.. డైరెక్ట్ గా అందరిముందే చెప్తామని ఆ సెల్ ఫోన్ పట్టుకొని నా చుట్టూనే తిరుగుతున్నారు ఆ పిల్ల దెయ్యాలని శ్రీవల్లి అంటుంది. అవునా అని భాగ్యం అనగానే ఏదో ఒకటి చెయ్యవే అని శ్రీవల్లి అంటుంది. చెయ్యాల్సింది నేను కాదు నువ్వే అని భాగ్యం అంటుంది. ఏంటని శ్రీవల్లి అడుగగా ఆ ప్రేమ ఫోన్ లేపెయ్యి అని భాగ్యం చెప్తుంది. నా వల్ల అవుతుందా అని శ్రీవల్లి అనగానే భాగ్యం, ఆనందరావు ఇద్దరు కలిసి శ్రీవల్లిని మోటివేట్ చేస్తారు. 

ఇక తను ప్రేమ గదిలోకి వెళ్ళి ఫోన్ దొంగిలిస్తుంది. అప్పుడే ప్రేమ, నర్మద వస్తారు. ఏంటక్కాయ్ ఏదో దాసుకొని వెళ్తున్నావని అడుగుతారు. ఇదిగో నీ ఫోన్ అని దాన్ని నీల్లలో వేస్తుంది శ్రీవల్లి. దాంతో అది డమ్మీ ఫోన్ అని అసలు ఫోన్ ని చూపిస్తారు ప్రేమ నర్మద.

ఇక ఆ తర్వాత శ్రీవల్లిని ప్రేమ, నర్మద బయటకు తీసుకెళ్ళి ఒక సర్కిల్ గీసి అందులోనే డ్యాన్స్ చేయమని చెప్తారు. దాంతో నాకు డ్యాన్స్ రాదని శ్రీవల్లి అంటుంది. ఆ సర్కిల్ లో ఒక బిందె పెట్టి దాని మీద డ్యాన్స్ చేయాలి లేకపోతే ఈ వాయిస్ రికార్డు అందరికి వెళ్ళిపోతుందని ప్రేమ, నర్మద బెదరిస్తారు‌‌. దాంతో చేసేదేమీలేక డ్యాన్స్ చేస్తుంది. అలా ఇద్దరు శ్రీవల్లిని ఆడుకుంటారు. 

మరోవైపు సాగర్ ఆఫీస్ కి రెడీ అవుతుంటాడు. తన పర్స్ చూసుకొని .. ఇందులో డబ్బులు లేవు.. బైక్ లో పెట్రోల్ లేదు.. ఎలా ఇప్పుడు అని సాగర్ అనుకుంటాడు. నర్మదని డబ్బులు అడగాలని అనుకుంటాడు కానీ అడుగలేడు. భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్ వస్తే కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాలని నర్మద అంటుంది. దానికి సాగర్ ఒప్పుకోడు. ఇక సాగర్ కి బెల్ట్ పెట్టి, క్యారేజ్ ఇస్తుంది నర్మద. తర్వాత నర్మద పర్స్ అని అడుగుతాడు సాగర్. ఏం దాచావ్ పర్స్ లో నా ఫోటో పెట్టుకున్నావా ఏంటని నర్మద పర్స్ అంతా వెతుకుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com