Home

»

Tv News

Brahmamudi: రాజుని చూసి షాకయిన రేఖ.. ఐశ్వర్య చెంప చెల్లు మనిపించింది!

Mar 28, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -992 లో...... రాజు, లక్కీ నెక్లెస్ తీసుకొని వస్తారు. రాజుని చూసి రేఖ షాక్ అవుతుంది. రాజు గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అప్పుడే అపర్ణ బయటకు వస్తుంటే కనిపెట్టి బయటకు రాకుండా చెయ్యమని భూషణ్ కి  చెప్తుంది. ఎక్కడ రాజుని చూస్తే  గుర్తుపడుతుందోనని భూషణ్ తో అలా  చెప్తుంది. రాజు గురించి రేఖ అడుగుతుంది కానీ తనేం  సమాధానం చెప్పడు. 

ఆ తర్వాత వెళ్ళిపోతాడు. అందరు వెళ్ళిపోయాక నా పెంపకాన్ని  వేలెత్తిచూపెట్టేలా చేసావని  ఐశ్వర్య చెంపచెల్లుమనిపిస్తుంది రేఖ. మీ నాన్న కూడా అంతే ఇలాంటి పనులు చేస్తూ దొరికిపోయేవాడని రేఖ కోప్పడుతుంది. 

ఆ తర్వాత అపర్ణ వాళ్ళ దగ్గరికి  భూషణ్ వెళ్లి.. మీరు మాటిమాటికి బయటకు ఎందుకు వస్తున్నారు..మమ్మల్ని అడగకుండా రాకని వాళ్ళకి  వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే ఇందు వస్తుంది. ఏమైంది అతను అలా అంటున్నాడని ఇందుని అపర్ణ అడుగుతుంది. ఏం లేదని ఇందు కవర్ చేస్తుంది. 

మరొకవైపు నిజం చెప్పవే ఆ నెక్లెస్ ఎక్కడ దొరికిందని స్వాతిని భ్రమరాంబ అడుగుతుంది. చెప్పను కదా అని భ్రమరాంబని స్వాతి ఒక ఆట ఆడేసుకుంటుంది . ఆ తర్వాత వెంకీ తన లవర్ ఇంటి ముందు ఉంటాడు. నందు వెళ్లి అతనికి మూవీ టికెట్స్ ఇస్తుంది. మీరు మాట్లాడుకుంటున్నారో కాల్ చెయ్ వింటాను. అప్పుడు నేను ఎలా హెల్ప్ చెయ్యాలో తెలుస్తుందని నందు అంటుంది. రోజా బయటకు వచ్చి టికెట్స్ తీసుకొని, 'థాంక్స్ వెంకీ' నేను మా కజిన్ వెళ్తానని ఒక హగ్ ఇచ్చి లోపలకి వెళ్తుంది.

అది నందు వింటుంది. చూసావా అది ఎవడితోనో మూవీకి వెళ్ళడానికి నిన్ను టికెట్స్ తీసుకొని రమ్మని చెప్పిందని వెంకీతో నందు అంటుంది. కజిన్ తో వెళ్లడం తప్పు కాదని వెంకీ అంటాడు. సరే రా రేపు రెస్టారెంట్ కి తీసుకొని రా.. అప్పుడు మీ మధ్య ఎంత లవ్ ఉందో చూస్తానని వెంకీతో నందు చెప్తుంది.

ఆ తర్వాత ఇందుకి స్వాతి అన్నం తినిపిస్తుంది. దాంతో  ఇందు ఎమోషనల్ అవుతుంది. అయినా వాళ్ళు కరెక్ట్ టైం కి  ఎలా వచ్చారు అక్క అని స్వాతి అడుగుతుంది. నేనే రప్పించానని ఇందు చెప్తుంది.రాజు, లక్కీలు నక్లెస్ అమ్మడానికి ప్రయత్నం చేస్తుంటే ఇందు వెళ్లి మీరు ఐశ్వర్యని ట్రాప్ చేసి మీ కార్ లో ఎక్కించుకొని వెళ్లి నెక్లెస్ కొట్టేసారు. ఇప్పుడు మర్యాదగా నెక్లెస్ తీసుకొని వెళ్ళండి..లేదంటే మర్యాదగా ఉండదని వాళ్లకి లొకేషన్ పంపి ఇంటికి వచ్చేలా చేసింది.. మొత్తం స్వాతికి చెప్తుంది. అక్క నువ్వు మాములు దానివి కాదని స్వాతి అంటుంది. 

తరువాయి భాగంలో రాజు ఇంటికి తన మనిషిని పంపించి రేఖ ఎంక్వయిరీ చేయిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com