Home

»

Tv News

Godhavari : నిత్యతో పెళ్లికి సూర్య నో.. జాను కోసం షాకింగ్ నిర్ణయం!

Aug 26, 2026 10:01AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గోదావరి Godhavari. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ 94 లో....నేను నిత్యని పెళ్లి చేసుకోనని సూర్య చెప్తాడు. బావ ఆ జానూని ప్రేమించావు.. ఎంజాయ్ చెసి.. వదిలేయ్ అంతే తప్పా..  లో క్లాస్ వాళ్ళతో మనకి సంబంధం ఏంటని కళ్యాణ్ అనగానే తన చెంప చెల్లుమనిపిస్తాడు సూర్య. నేను జానూని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను.. నేను బెంగుళూరు వెళ్తున్నానని వెళ్తాడు. దాంతో సింహాద్రి వెనకాల వచ్చి నీకు నచ్చినట్లు చెయ్ సూర్య అని చెప్తాడు.

 

నేను నిన్ను డ్రాప్ చేస్తాను పదా అనగానే కార్ ఎక్కుతాడు. ఆ తర్వాత నందు ఇంటిపేపర్స్ ఒకతనికి ఇచ్చి అమ్మి పెట్టమని చెప్తుంది. ఎందుకు అక్క ఇప్పుడు అదంతా అని జాను అంటుంది. మరి కిన్నెరా ఆపరేషన్ ఎలా చేయిస్తాం.. ఇల్లు అమ్మేసి సిటీకి వెళదామని నందు అంటుంది. అప్పుడు అక్కడ ఉన్న ఒకతను ఇప్పుడు మీరు అమ్మాలని చూసిన సింహాద్రికి బయపడి ఎవరు రారు.. మీరు సిటీకి వెళ్లిపోండి నేను సింహాద్రికి తెలియకుండా అమ్మి పెడతానని చెప్పగానే నందు సరే అంటుంది. ఆ తర్వాత నందు మురళి ఒక జీరాక్స్ షాప్ కి వెళ్తారు. వాళ్లని ఒక రౌడీ ఫాలో అవుతాడు.

 

ఆ విషయం సింహాద్రికి ఫోన్ చేసి చెప్తాడు. అప్పుడు సింహాద్రి ఫోన్ స్పీకర్ లో పెట్టి మాట్లాడుతాడు. నందు, మురళి ఎదురుగా ఉంటారు. సూర్య వాళ్లని చూస్తాడు. ఆ సింహాద్రి కుటుంబానికి నేనంటే భయం లేదు అందుకే భయం అంటే ఏంటో చూపిస్తాను. ఇప్పుడు ఆ కార్ తో నందు, మురళి వాళ్ళకి డాష్ ఇవ్వమని రౌడీకి చెప్తాడు. దాంతో సూర్య త్వరగా వెళ్లి వాళ్ళని పక్కకి లాగుతాడు. వాళ్ళని ఆటో ఎక్కించి ఇంటికి పంపిస్తాడు. తరువాయి భాగంలో నాకూతురు నిత్యకి నా అల్లుడు సూర్యకి మీ తోటలో పెళ్లి అని శుభలేక జాను వాళ్ళకి ఇస్తాడు సింహాద్రి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com