Home

»

Tv News

Brahmamudi : చలపతి ఇంటికి సిరిని తీసుకెళ్లిన రాజు.. ఇందు ఇంట్లో రేఖ రచ్చ!

Sep 13, 2026 2:26PM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1136 లో...రాజు స్పృహలోకి వచ్చిన సిరిని తీసుకుని చలపతి ఇంటికి వెళ్తాడు. ఈ అమ్మాయి ఎవరంటూ చలపతి నిలదీయగా సిరి అని చెప్పగానే తనేనా నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయి అని లక్ష్మీ అడుగుతుంది. ఇది మన ఇల్లు నాన్నా అందుకే ఇక్కడికి తీసుకొచ్చానని అంటాడు రాజు. దీంతో చలపతి ఫైర్ అవుతాడు. మనం ఎంత పరువుగా బతుకుతున్నామో గుర్తుంటే ఇలాంటి పని చేసేవాడివి కాదని, నా కోపం పెరగకముందే తీసుకెళ్లమని చెప్తాడు. భరత్ కూడా ఇందు వదిన పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తాడు. అప్పుడే సిరి చిన్నపిల్లలతో ఆడుకుంటూ కనిపించడంతో అందరు షాకవుతారు. తను కోమాలోంచి బయటకు వచ్చినా గతం మర్చిపోయి 6 ఏళ్ల చిన్న పిల్లలా ప్రవర్తిస్తోందని.. గతం గుర్తొచ్చేవరకు ఇక్కడే ఉంచాలని రాజు బ్రతిమిలాడతాడు. చివరికి లక్ష్మి ఒప్పించడంతో చలపతి అయిష్టంగానే ఒప్పుకుంటాడు.

సిరిని ఇంట్లో ఉంచి లక్ష్మీకి బాధ్యత అప్పజెప్పి రాజు బయటకు వెళ్తాడు. సిరి మొగుడా అని పిలవడంతో లక్ష్మీ, భరత్ షాకవుతారు. డాక్టర్ అలాగే చెప్పాడని రాజు సర్దిచెప్తాడు. రెండు జడలు వేయమని సిరి అడగడంతో లక్ష్మీ వేస్తుంది. మరోవైపు ఇంటికి వెళ్లిన రాజును భ్రమరాంబ నిలదీస్తుంది. ఉదయమే హడావిడిగా ఎక్కడికి వెళ్లావని ప్రశ్నించగా నాకు పర్సనల్ పనులుంటాయని రాజు అంటాడు. తన మొదటి భార్య దగ్గరకే వెళ్లాడని భ్రమరం అనడంతో సుభాష్ సీరియస్ అవుతాడు. ఇలా అడగాల్సింది నేనే, నేను అడగనప్పుడు మీరెవరు అడగడానికి అంటూ ఇందు ఫైర్ అవుతుంది. నా మనవడి గురించి నాకు తెలుసు, నేను రాజును నమ్ముతున్నానని అపర్ణ చెప్తుంది.

అప్పుడే రేఖ ఎంట్రీ ఇచ్చి రాజు చేతిలో మీరంతా కీలుబొమ్మల్లా మారారని.. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్లు ఉందని అంటుంది. రాజు హాస్పిటల్ లో భర్తగా సంతకం చేశాడని చెప్పినా మీరు నమ్మడం లేదని నిలదీస్తుంది. సుభాష్, అపర్ణ మాత్రం రాజును వెనకేసుకొస్తారు. నా కొడుకును దూరం చేసినట్లే రేపు మీ మనవరాలిని మోసం చేస్తాడని రేఖ అనగా నువ్వు అనుకున్నది జరగదని.. నేను ఎప్పటికీ ఇందు చేయి వదలనని ఇందు చేయి గట్టిగా పట్టుకుంటాడు రాజు. ఎపిసోడ్ చివర్లో ఐశ్వర్య వచ్చి హాల్ టికెట్ కి 50 వేలు కావాలని అడుగుతుంది. నువ్వు ఫ్రెండ్స్ తో ఎక్కడికో వెళ్లడానికి అడుగుతున్నావా అని రాజు అనగా నువ్వు ఇందును కిడ్నాప్ చేశావని ఇందుకు చెప్తుంది ఐశ్వర్య. దీంతో ఇందు షాకవుతుంది. తర్వాత రేఖ దగ్గరకు వెళ్లి నేను పాస్ అవుతానని ఇందు చేతే కంపెనీ పెట్టిస్తానని చెప్తుంది. దీంతో నీ ద్వారానే సామ్రాజ్యాన్ని లాక్కుంటానని రేఖ మనసులో అనుకుంటుంది.ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

[Brahmamudi Serial Today Episode, Brahmamudi Sept 12 Episode, Raju Siri Chalapathi house, Indu Rekha fight, Star Maa Brahmamudi]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com