బిగ్ బాస్ సీజన్-10 లో ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అయిన చైత్ర ఎమోషనల్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. షోలోకి విన్నర్ అవుదామని వెళ్లిన తనకు అన్ ఫెయిర్ ఎలిమినేషన్ జరిగిందని చైత్ర కన్నీళ్లు పెట్టుకుంది. హౌస్ లో తనను సరిగ్గా చూపించలేదని ఆడియన్స్ కి తన నిజమైన క్యారెక్టర్ తెలియకముందే బయటకు పంపేశారని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇక తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ చైత్ర షాకింగ్ కామెంట్స్ చేసింది. తనకు పిల్లలు పుట్టాక హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ అయిందని దానివల్లే తను లావు అయ్యానని చెప్పింది. దీంతో తనపై నెగెటివ్ కామెంట్స్ వచ్చాయని..అమ్మాయిలు కూడా నీకు సిగ్గు లేదా అంటూ ఎగతాళి చేశారని చెప్తూ ఏడ్చేసింది. ఒక తల్లిగా తను పడిన బాధను ఎవరు అర్థం చేసుకోలేదని.. బాడీ షేమింగ్ తో చాలా కుంగిపోయానని చైత్ర ఎమోషనల్ అయింది.
బిగ్ బాస్ హౌస్ లోకి వెళితే తనకు కొత్త లైఫ్ వస్తుందని, తనను తాను ప్రూవ్ చేసుకుంటానని అనుకుందట కానీ వారం రోజుల్లోనే ఎలిమినేట్ అవ్వడంతో ఆ కల కలగానే మిగిలిపోయిందని చెప్పింది. అయినా తాను కుంగిపోనని.. ఈ బాడీ షేమింగ్ కామెంట్స్ నే తన బలంగా మార్చుకుంటానని చైత్ర స్ట్రాంగ్ గా చెప్పింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు చైత్రకు సపోర్ట్ గా నిలుస్తున్నారు.
[Bigg Boss 10 Chaitra emotional video, Chaitra unfair elimination Bigg Boss Telugu 10, Chaitra hormonal imbalance body shaming, Bigg Boss 10 eliminated contestant Chaitra, Chaitra interview idream media]




