Home

»

Tv News

Brahmamudi : రేఖ పిన్ని కొడుకే లక్కీ.. DNA రిపోర్ట్ తో బయటపడ్డ నిజం, షాక్ లో భూషణ్ ఫ్యామిలీ!

Sep 1, 2026 10:49AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి Brahmamudi. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్  1125 లో లక్కీ కన్నతల్లి మన రేఖ పిన్నేనని రాజు అందరి ముందు కుండబద్దలు కొడతాడు. దీంతో అపర్ణ ఏంటి నిజమా అని షాక్ అవుతుంది. లక్కీ మాత్రం అమ్మ దొరికిందని ఎమోషనల్ అవుతాడు. భ్రమరాంబ, భూషణ్ మాత్రం ఇదంతా అబద్ధం.. మమ్మల్ని కొట్టుకోవాలని మీరు ఆడుతున్న డ్రామా అని నమ్మరు. దానికి రాజు ముందే ఊహించానని DNA రిపోర్ట్ ని సాక్ష్యంగా చూపిస్తాడు. ఆ రిపోర్ట్ చూసి భూషణ్, మదన్ షాక్ అవుతారు.

 

చివరికి రేఖ తప్పక ఒప్పుకుంటుంది. అవును లక్కీ నా కొడుకే రాజు చెప్పింది. DNA రిపోర్ట్ నిజమే.. వాడు నా రక్తం పంచుకుని పుట్టినవాడే అని చెప్తుంది. దీంతో ఇంట్లో అందరు షాక్ అవుతారు. ఇన్నిరోజులు నా ఫ్రెండ్ ఎన్నో అవమానాలు పడ్డాడు.. రేఖ పిన్నికి ఎన్నో అవకాశాలు ఇచ్చినా చెప్పలేదు. అందుకే బయటపెట్టానని రాజు అంటాడు. ఇంకోసారి నా ఫ్రెండ్ జోలికి, మా పెళ్లి జోలికి వస్తే ఊరుకోనని ఐశ్వర్యకు లాస్ట్ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు రాజు.

 

ఆ తర్వాత భ్రమరాంబ తన ఆట మొదలుపెడుతుంది. ఎంత మోసం చేసింది రేఖ.. మనం దాన్ని చూసి భయపడేవాళ్ళం కానీ అది ఎంత పెద్ద మోసం చేసిందని భూషణ్ ను రెచ్చగొడుతుంది. శేషు కూడా నేను ముందే చెప్పా అల్లుడికి యాక్సిడెంట్ అయ్యాక రేఖలో మార్పు వచ్చింది.. లక్కీ వచ్చాక కళ్ళల్లో భయం కనిపిస్తోందని చెప్పానని అంటాడు. ఆస్తి కోసం మీరే రేఖకు భయపడేవాళ్లు కదా అని ఎద్దేవా చేస్తాడు. మదన్ సమాజంలో ఎలా తలెత్తుకుంటాడు.. నిన్ను మోసం చేసింది.. రేఖను వదిలిపెట్టకురా తమ్ముడు అని భూషణ్ కోపాన్ని ఇంకా పెంచుతుంది భ్రమరం. దీంతో భూషణ్ ఏమీ మాట్లాడకుండా కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

 

మరోవైపు లక్కీ రేఖతో గుండెలు తరుక్కుపోయేలా మాట్లాడుతాడు. నువ్వే మా అమ్మ అని తెలియకుండా నీకే నా బాధ చెప్పుకున్నాను.. ఎందుకు నన్ను వదిలేశావ్ అమ్మ అని ఏడుస్తాడు. అమ్మ స్పర్శ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని రేఖ చేతిని పట్టుకోబోతే రేఖ తన చేతిని వెనక్కి తీసుకుంటుంది. నేనంటే నీకు ఇష్టం లేదని తెలుసు..అయినా నువ్వు కొడుకుగా ఒప్పుకునే వరకు ఎదురుచూస్తానని లక్కీ అంటాడు. ఇంకోవైపు ఎందుకు ఇలా చేశావని రాజుని ఇందు అడుగుతుంది. ఇప్పుడు రేఖ ఆంటీ పగతో ఏం చేస్తుందోనని భయపడుతుంది. దానికి తప్పు చేసింది కాబట్టి పర్యవసానాలు అనుభవించాల్సిందే.. నేను ఉండగా మీకు ఏం కానివ్వను అని ఇందుకు ధైర్యం చెప్తాడు రాజు. చివరికి మదన్, భూషణ్ రేఖ విషయంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com