Brahmamudi : అమ్మోరు పూనింది.. అసలు నిజమేంటో వారికి తెలియనుందా?
on May 3, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -400 లో... కావ్య ఇంటికి వస్తుంది. తనని చూసిన రాజ్.. ఎక్కడికి వెళ్ళావని అడుగుతాడు. మీ వెనకాలే వచ్చానని అనగానే రాజ్ కాస్త కంగారుపడతాడు. వెనకాల రావడం ఏంటని రాజ్ అడుగగా.. అంటే బాబుకి డైపర్స్ తీసుకొని రావడానికి వెళ్ళానని చెప్తుంది. ఆ తర్వాత రాజ్ ని కావ్య ఫోన్ ఇవ్వమని అడుగుతుంది. రాజ్ మొదట ఇవ్వనని చెప్పినా ఆ తర్వాత ఇస్తాడు.
ఆ తర్వాత కావ్య బయటకు వెళ్లి రాజ్ ఫోన్ లో ఆ బ్లాక్ మెయిల్ చేసిన అతని నెంబర్ తీసుకుని.. అప్పుకి ఫోన్ చేసి ఆ నెంబర్ ఎవరిదో కనుక్కోమని చెప్తుంది. ఆ తర్వాత కావ్య వెనక్కి తిరిగేసరికి రాజ్ ఉంటాడు. ఫోన్ చెయ్యాలని ఫోన్ తీసుకొని నీ ఫోన్ నుండే ఫోన్ మాట్లాడుతున్నావ్.. ఎందుకు ఫోన్ తీసుకున్నావని అడుగుతాడు. కావ్య ఎదో ఒకటి కవర్ చేస్తుంది. అప్పుకి ఫోన్ చేశానని చెప్తుంది. మరోవైపు తర్వాత స్వప్న ఇంట్లో ఆస్తి పేపర్స్ కోసం చూస్తుంది. కనకంకి స్వప్న ఫోన్ చేసి తనకి వచ్చిన ప్రాబ్లమ్ గురించి చెపుతుంది. ఆ తర్వాత స్వప్న రాత్రి సేట్ ఇంటి ముందుకు వచ్చి.. కనకం కి ఫోన్ చెయ్యగానే తను అమ్మోరు వేషంలో వస్తుంది. తనని చూసిన స్వప్న బయపడుతుంది. నేను మీ అమ్మని అని స్వప్నతో కనకం చెప్తుంది. ఆ తర్వాత కనకం సేట్ గదిలోకి వెళ్లి.. తన ఛాతిపై కాలు పెట్టి అమ్మోరులాగా మాట్లాడుతుంది. నిజంగానే అమ్మోరు వచ్చారనుకోని సేట్ భయపడతాడు. నువ్వు ఒక తప్పు చేసావ్? స్వప్న ఆస్తి పేపర్స్ ఎందుకు తీసుకున్నావని అనగానే.. నేను తీసుకోలేదు రాహుల్ ఇచ్చాడని సేట్ చెప్తాడు. తన పేపర్స్ తనకి ఇచ్చేయని అమ్మోరు వేషంలో ఉన్న కనకం చెప్పి.. అక్కడ నుండి మాయమవుతుంది.
మరొకవైపు కావ్యకి అప్పు ఫోన్ చేస్తుంది. నువ్వు ఆ అడ్రెస్ కి ఒక్కదానివే వెళ్తావా? నేను కూడా వస్తాను ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చెయ్యాలని అప్పు అంటుంది. రేపు లొకేషన్ పంపిస్తాను. మా వాళ్ళతో వస్తానని అప్పు చెప్తుంది. ఆ తర్వాత రాహుల్, రుద్రాణి ఇద్దరు కలిసి డ్రింక్ చేస్తుంటే.. అప్పుడే స్వప్న వచ్చి.. మీతో డాన్స్ చెయ్యాలని ఉందని చెప్తుంది. కాసేపు మీరు కొడలు.. నేను అత్త అని స్వప్న అనగానే.. రుద్రాణి హ్యాపీగా ఫీల్ అవుతూ డాన్స్ చేస్తుంది. తరువాయి భాగంలో కావ్య, అప్పు ఇద్దరు కలిసి రాజ్ ని బ్లాక్ మెయిల్ చేసిన అతని దగ్గరికి పోలీసులతో వచ్చి.. అసలు నిజం చెప్పమని అడుగుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read