.webp)
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం అంటే అదొక లక్కు. అందుకోసం అగ్నిపరీక్ష ఎదుర్కోక తప్పదు.. ఇక సీజన్ 10 లోకి వెళ్ళడం కోసం బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2 లో సెలెక్షన్స్ హోరాహోరీగా సాగుతున్నాయి. పార్టిసిపేట్స్ అందరు తమవంతు కృషి చేస్తూ జ్యూరీస్ మెప్పు పొందుతున్నారు. రెండు రెడ్ లు ఇచ్చి ఒక్క గ్రీన్ ఇచ్చి హోల్డ్ లో పెడుతున్నారు జడ్జెస్. హోల్డ్‌లో పెట్టడం అంటే.. ఇంకా ఛాన్స్ ఉంది, మళ్లీ ఆలోచిస్తామని అర్థం. కానీ ఇప్పుడు శ్రీనివాస్, గౌరి, రమ్య, గౌతమ్, ఐశ్వర్య, అభిజ్ఞ, శ్రీరామ్, సాక్షిత లాంటి 8 మందిని అలా నేరుగా పంపేయడం కొంచెం అన్ ఫెయిర్ గా అనిపించింది.
జ్యోత్స్న వాళ్ళ నాన్న గురించి ఎమోషనల్ స్టోరీ చెప్పినా, అభిజ్ఞ స్టేజ్ మొత్తం కుదిపేసినా కూడా "హోల్డ్" అన్నారు. ఆశ ఇచ్చి తర్వాత తీసేయడం కంటే మొదట్లోనే రెడ్ ఇచ్చేయడం బెటర్. లేకపోతే.. ఎందుకు హోల్డ్ చేశారనే ఫీలింగ్ వస్తుంది. బిగ్ బాస్ అంటే టాస్క్, పర్ఫామెన్స్ చూసి తీస్తారు కదా. ఇక్కడ 70 మంది ఆడిషన్స్ తర్వాత, హోల్డ్ వాళ్లకు కనీసం ఒక గ్రూప్ టాస్క్ కూడా పెట్టకుండా ఎలిమినేట్ చేయడం రూల్‌కి విరుద్ధంగా ఉంది. రెండు గ్రీన్స్ వచ్చిన వాళ్లు కూడా వెళ్లిపోవడం అంటే జడ్జిల మధ్య ఏకాభిప్రాయం లేనట్టే. నిజం చెప్పాలంటే ఇలాంటి ట్విస్ట్‌లతోనే డిస్కషన్ క్రియేట్ అవుతుంది. అభిజ్ఞ ఎందుకు వెళ్లిపోయింది.. జ్యోత్స్న కి ఇంకో ఛాన్స్ ఇవ్వొచ్చు కదా అని అందరు మాట్లాడుకుంటున్నారు. అంటే కావాలనే కంట్రవర్సీ పుట్టించి బజ్ తెస్తున్నారేమో.
ఈ అగ్నిపరీక్షలో మంచి విషయం ఏంటంటే టాప్ 15కి వచ్చిన మగ్గురికి అయితే క్లారిటీ ఇచ్చారు. ఇక ముందు హోల్డ్‌లో ఉన్న 26లో నుంచి ఎవరిని తీస్తారో చూడాలి మరి. మొత్తానికి ఈ సీజన్ 2 మొత్తం ఎమోషన్ తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ఇంకా ఎలిమినేషన్ ని కలిపిన ప్యాకేజ్ లా ఉంది. కానీ కంటెస్టెంట్ల పరంగా చూస్తే కొంచెం అన్ ఫెయిర్ గా అనిపిస్తుంది. మరి ఇన్ని ఎపిసోడ్ లలో వచ్చిన కంటెస్టెంట్స్ లలో ఎవరు మీకు బాగా నచ్చరు.. జడ్జెస్ రిజెక్షన్స్ పై మీ కామెంట్ ఏంటో కామెర్లు చేయండి.




.webp)
.webp)
