Home

»

Tv News

Agnipariksha season2 : సామాన్యుల ఎంపికలో ఊహించని పరిణామాలు..టాప్ 15 ఎంపికలో ఊహించని ట్విస్టులు

Aug 20, 2026 10:05AM

బిగ్ బాస్ సీజన్ 10 లోకి కొంతమందిని అగ్నిపరీక్ష ప్రక్రియలో గెలిచిన వారిని పంపిస్తున్నారు మేకర్స్.  అయితే ఈ ప్రక్రియను ఒక్కో రోజు ఒక్కో ఎపిసోడ్ లాగా జియో హాట్ స్టార్ లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇక నిన్నటి ఎపిసోడ్ లో .. అభిజ్ఞ అనే టెకీ అమ్మాయి వచ్చింది. తను వచ్చీరాగానే స్టేజ్ మొత్తం హడావిడి అయిపోయింది. చేతుల్లో కుండలు పెట్టుకొని డ్యాన్స్ చేసింది, పాడింది, నవ్వించింది. ఓడిపోవడానికి వస్తున్నానా? ఆడినా గెలిచినట్టే కదా అనే డైలాగ్ తో అందరిని ఆకట్టుకుంది. అభిజిత్, బిందు గ్రీన్ ఇచ్చారు. నవదీప్ మాత్రం.. స్పిరిట్ నచ్చింది కానీ డైరెక్ట్ గా టాప్ 15 కి కుదరదని రెడ్ ఇచ్చి హోల్డ్ లో పెట్టాడు. ఫుటా అనే జపాన్ మ్యూజిషియన్ కూడా తెలుగు నేర్చుకుంటున్నానని చెప్పి ట్రై చేశాడు. నవదీప్ గ్రీన్ ఇచ్చినా లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అని బిందు రెడ్ ఇచ్చి నెక్స్ట్ ఇయర్ రమ్మంది.

 

ఇక తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చిన హేమంత్ మొదట్లో కాస్త ఓవర్ గా అనిపించినా తర్వాత నాన్నతో ఉన్న గ్యాప్ గురించి చెప్పి ఎమోషనల్ చేశాడు. కానీ స్టేజ్ పై ఫోన్ కాల్ లో మాట్లాడిన దానికి, చెప్పిన స్టోరీకి లింక్ కుదరలేదు. దాంతో నవదీప్, అభిజిత్ రెడ్ ఇచ్చారు. బిందు ఒక్కతే గ్రీన్ ఇచ్చి హోల్డ్ చేసింది. చివర్లో వచ్చిన మంచిర్యాల ప్రియాంక యాంకర్, రిపోర్టర్ అని చెప్పింది. పెద్దగా సందడి లేకపోయినా ఓ మోస్తరుగా ఎంటర్ టైన్ చేసింది. ఆమెకు నవదీప్, అభిజిత్ గ్రీన్ ఇచ్చారు, బిందు మాత్రం హోల్డ్ లో పెట్టింది. సాయి శౌర్య, ధనలక్ష్మి, రుచిత, హరి ప్రసన్న, సోని, నవీన్... ఇలా చాలా మందిని నిమిషం కూడా మాట్లాడనివ్వకుండా పంపేశారు.

 

శ్రుతి, లవ్లీ చిన్నా, నమిత, రామకృష్ణ, మేరీ రోజి, వెంకటకృష్ణ కూడా అంతే. 70 మందిలో నుంచి చివరికి టాప్ 15 కి 3గురే, హోల్డ్ లో 26 మంది అన్నారు. కానీ ఆ హోల్డ్ లో ఉన్న అభిజ్ఞ, శ్రీనివాస్, గౌరి, రమ్య, గౌతమ్, ఐశ్వర్య, శ్రీరామ్, సాక్షిత లాంటి వాళ్లని ఏ టాస్క్ పెట్టకుండానే డైరెక్ట్ గా ఎలిమినేట్ చేశారు. అందులో 2 గ్రీన్స్ వచ్చినోళ్లు కూడా ఉన్నారు. అందుకే ఆడియన్స్ కి ఇదేంటి ఇలా అనిపించింది. మరి మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com