ఫైర్ బ్రాండ్ గలాటా గీతు రెమ్యూనరేషన్ ఎంత?
on Oct 7, 2022
బిగ్ బాస్ సీజన్ 6లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది ఎవరంటే.. గీతు రాయల్! గీతు పూర్తి పేరు గ్రీష్మ గీతిక లేఖ రాయల్. తను వ్యాపారవేత్త శేఖర్ కోవూరు, అమ్మ సుధారాజంలకు 1997 ఆగస్ట్ 27న పుట్టింది. ఈమె 2014లో రన్నింగ్ బస్సు ఎక్కుతుండగా కింద పడిపోయి, నెల రోజులు కోమా లో ఉందట. అయితే ఇప్పటికి కూడా చాలా సంగతులు గుర్తుండవట.
ఈమె తన చిన్ననాటి స్నేహితుడు అయిన వికాస్ ను 4 ఫిబ్రవరి 2021న పెళ్ళి చేసుకుంది. చిన్నప్పటి నుండి తనకి చదువు అంటే చాలా ఇష్టం. అందుకే చదవడం పూర్తవగానే జాబ్ వచ్చిందట. మొదటగా అమెజాన్లో జాబ్ వచ్చింది. కానీ ఆమెకు RJ కావాలని ఆసక్తి ఉండేది. ఆ కంపెనీలో జాబ్ మానేసి ఒక ఛానల్ లో RJ గా జాయిన్ అయింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తను Blogs, డబ్స్మాష్ లతో నెటిజన్స్ ని ఆకట్టుకోవడమే కాకుండా మోటివేషనల్ వీడియోస్ తో మంచి ఫాలోయింగ్ ని కూడా సంపాదించుకుంది.
ఈ ఫాలోయింగ్ స్టార్ కామెడీ షో అయిన జబర్దస్త్ లో ఛాన్స్ కొట్టేలా చేసింది. దీంతో తన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తరువాత బిగ్ బాస్ రివ్యూ చేస్తూ పలు వీడియో లు చేయడం, అవి బాగా ఫేమ్ అవ్వడంతో ఎక్కువ మందిని ఆకట్టుకుంటుంది. అదే ఇప్పుడు తనకి బిగ్ బాస్ లో అవకాశం వచ్చేలా చేసింది. చలాకితనం, అల్లరి చేష్టలు, సూటిగా మాట్లాడే గుణం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ అని తనే ఎప్పుడూ చెప్తుంటుంది.
ఎనిమిదవ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన తను, హౌస్ లో మొదటి వారం.. అటు కంటెస్టెంట్స్ కి, ఇటు చూసే ప్రేక్షకులకు సైతం చిరాకు తెప్పించింది. ఏంటి ఈ అమ్మాయి ఇలా చేస్తోందని అనుకోని ప్రేక్షకులు ఉండరు. కానీ రెండవ వారం తన ఆటతీరును మార్చేసింది. రెండవ వారం నుండి వరుసగా అన్ని వారాలు నామినేషన్ లో ఉంది. కానీ ప్రేక్షకులకు తన ఆట తీరు, ముక్కు సూటిగా చెప్పే విధానం నచ్చి ఓట్లు వేసి సేవ్ చేస్తున్నారు.
అయితే తను మాత్రం ప్రత్యేకమైన శైలితో హౌస్ లో బాగా పర్ఫామెన్స్ చేస్తూ ఉంటోంది. కాగా అందరినీ తన చిత్తూరు యాసతో అలరిస్తూ, బిగ్ బాస్ చూసే వారందరికి వినోదాన్ని ఇస్తోంది. నాగార్జునని సైతం తన ఆట తీరుతో మెప్పిస్తూ, ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంటోంది. "హౌస్ లో ఎలాంటి రిలేషన్ పెట్టుకోను, అలా పెట్టుకుంటే గేమ్ ఆడలేను" అని హౌస్ మేట్స్ తో ఎప్పుడూ చెప్తూ ఉంటుంది.
అయితే తన మీద ఎప్పుడు కేర్ చూపించే ఆదిరెడ్డి, ఆదిత్య తనకి ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది అంట. బిగ్ బాస్ సీజన్ 6లో గీతు లేనిదే ఎంటర్టైన్మెంట్ లేదని అంటున్నారు, ఈ షో చూసే ప్రేక్షకులు. ఇప్పటివరకు అందరిని తన ఆటతో మెప్పిస్తూ వస్తోంది. కాగా గీతుకి రెమ్యూనరేషన్ రోజుకి ముప్పై నుండి నలభై వేల వరకు ఉండొచ్చని బయట ప్రచారంలో ఉంది. ఇక మునుముందు ఈ చిత్తూరు చిరుత పులి ఆట ఏంటో? ఎలా ఆడుతుందో? చూడాలి మరి.
Also Read