TeluguOne App Promotion
● # Tweets

Home

»

టీవీ

BiggBoss 10 Telugu: హౌస్ లోకి వీజే సన్నీ, సిరి హనుమంత్ ఎంట్రీ.. గెలిచిన నరేశ్,కుంగిపోయిన వర్షిణి!

Nov 27, 2026 11:09AM

బిగ్ బాస్ సీజన్-10 తెలుగు పన్నెండో వారం  బడ్డీ అప్ థీమ్‌ సాగుతోంది. ఇందులో భాగంగా నిన్నటి ఎపిసోడ్‌లో వీజే సన్ని, సిరి హనుమంత్ ఎంట్రీ ఇచ్చారు. విజే సన్నీ తన స్టైల్లో కంటెస్టెంట్ల గురించి చెప్పాడు. త్రిగుణ్ అన్న.. త్రిగుణదూత అని మీకే పెట్టినట్టున్నారని పాట పాడతారు. నీది మంచి గేమా? బ్యాడ్ గేమా? అన్నది అర్థం కావడం లేదు.. ఫ్రెండ్ అంటావ్.. నామినేషన్స్ అంటూ పొడిచేస్తావని త్రిహుణ్ తో అంటాడు విజే సన్నీ. బయట విలన్ అయినా ఇంట్లో హీరో అని వంశీని పొగిడేస్తాడు. మీ అమ్మ అనే శక్తి నిన్ను కాపాడుతోందని సుధీర్‌కి చెప్తాడు. వర్షిణి మాత్రం ముకేష్ సంరక్షిణిగా ఉంటోంది.. ఇప్పటికైనా సొంతంగా ఆడు.. ఆటలో రిలేషన్స్ తీసుకు రాకండి.. ఆట వరకు పోరాడండి.. ఆట తర్వాత మళ్లీ అందరూ కలిసిపోండి అని సలహా ఇస్తాడు.నరేష్ మాత్రం అందరికీ నచ్చేస్తున్నాడు.. ఐ లవ్యూ నరేష్ అని సిరి చెప్తుంది.

 

అలా కాసేపు అందరి గురించి సన్నీ, సిరి చెప్తుంటారు. ఆ తర్వాత సిరి వర్షిణిని ఎంచుకుంటుంది. సన్నీ మాత్రం వంశీ, సుధీర్‌లను సంప్రదించి.. నరేష్‌తో జత కట్టేస్తాడు. అలా సన్నీ ఏమో నరేష్ కోసం, సిరి ఏమో వర్షిణి కోసం ఆడతారు. కానీ ఇందులోని మొదటి దశలోనే వర్షిణి స్ట్రక్ అవుతుంది. గోడను బద్దలు కొట్టలేక అక్కడే టైం వేస్ట్ చేస్తుంది. కానీ నరేష్ మాత్రం తన ప్రాణం పెట్టేస్తాడు. బాడీని వాడేస్తాడు.. తలతో గోడను బద్దలు కొట్టేస్తుంటాడు. వర్షిణి మాత్రం కేవలం చేతుల్నే వాడుతూ.. గోడను బద్దలు కొట్టలేకపోతుంది. ఆ తర్వాత నరేష్ మరింత వేగంతో టాస్క్ కంప్లీట్ చేస్తాడు. నరేష్‌కి తోడుగా సన్నీ అద్భుతంగా బ్యాలెన్స్ చేసి విన్ చేయిస్తాడు.ఓటమితో వర్షిణి కుంగిపోతుంది. నరేష్ బాడీ మొత్తం వాడాడు.. నేను కేవలం చేతుల్నే వాడాను.. నాకు వచ్చిన అవకాశాన్ని కూడా ఉపయోగించుకోలేకపోయానని  ఏడ్చేస్తుంటుంది వర్షిణి. వర్షిణి బాగా ఆడావని బిగ్ బాస్ మెచ్చుకోవడంతో కాస్త రిలాక్స్ అవుతుంది.

 

హౌస్ లో వీజే సన్నీ ఎంట్రీతో కంటెస్టెంట్స్ ఫుల్ పాజిటివ్ మూడ్ లోకి వచ్చేశారు. అందరు నరేశ్ కి క్రెడిట్ ఇస్తుండంటతో మిగతా కంటెస్టెంట్స్ కాస్త డిస్సప్పాయింట్ అవుతున్నారు. అయితే నరేశ్ కెప్టెన్సీ రేస్ లో నిలిచాడు. 

google-ad-img