
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రెండో వారానికి చేరుకోవడంతో హౌస్ లో గొడవలు పీక్స్ కి చేరాయి. మొదటి వారంలో చరణ్, చైత్ర రాయ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా బయటకు వెళ్లగా, ఈ రెండో వారం నామినేషన్స్ లో ఏకంగా 11 మంది ఉన్నారు. రోహిత్, ముఖేష్ గౌడ, రామ్ ప్రసాద్, త్రిగుణ్, దేబ్జానీ, కృష్ణుడు, వర్షిణి, షాలిని, సృష్టి, ఝాన్సీ, సుధీర్ నామినేట్ అవ్వడంతో ఓటింగ్ ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం వచ్చిన ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా వచ్చి వివాదాలకు కేరాఫ్ గా మారిన రోహిత్ నాయుడు దాదాపు 30 శాతం ఓట్లతో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.
రోహిత్ కి గట్టి పోటీ ఇస్తున్నది గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ ముఖేష్ గౌడ. సైలెంట్ గా, కూల్ గా ఉన్నా ఫ్యామిలీ ఆడియన్స్, సీరియల్ ఫ్యాన్స్ సపోర్ట్ తో ముఖేష్ 29 శాతం ఓట్లతో రోహిత్ కి చేరువగా రెండో స్థానంలో ఉన్నాడు. మరోవైపు ఇంకో ట్రెండ్ లో త్రిగుణ్ టాప్ లోకి దూసుకొచ్చాడని, రోహిత్ తో కేవలం 1 శాతం తేడాతో ఉన్నాడు. జబర్దస్త్ క్రేజ్ తో వచ్చిన రామ్ ప్రసాద్ 8 శాతం ఓట్లతో మూడో స్థానంలో సేఫ్ గా ఉన్నాడు. ఏది ఏమైనా రోహిత్, ముకేష్, త్రిగుణ్ ముగ్గురే ఈ వారం టాప్-3 లో ఉన్నారు, వీళ్లు చాలా సేఫ్ జోన్ లో ఉన్నట్లే.
ఇక డేంజర్ జోన్ విషయానికొస్తే వస్తే బాటమ్ లో నలుగురు ఉన్నారు. ఓటింగ్ ట్రెండ్ ప్రకారం దిగువన స్రిష్టి, ఝాన్సీ, వర్షిణి, కృష్ణుడు ఉన్నారు. ముఖ్యంగా వర్షిణి, కృష్ణుడు మధ్య ఓట్ల తేడా చాలా తక్కువగా ఉంది. మొదటి నుంచి నస క్యాండిడేట్ గా ముద్రపడ్డ త్రిగుణ్ గతంలో 7 శాతం ఓట్లతో నాలుగో స్థానానికి పడిపోయినా ఇప్పుడు పుంజుకున్నాడు కానీ కృష్ణుడు మాత్రం ఇంకా బాటమ్ లోనే ఉన్నాడు. దేబ్జానీ 6 శాతం, షాలిని 5 శాతం ఓట్లతో వారి తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక ఈ వారం ఎలిమినేషన్ ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది. అధికారిక ఓటింగ్ ప్రకారం చూస్తే కృష్ణుడు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది.
[Bigg Boss Telugu 10, Bigg Boss Telugu Season 10, Bigg Boss Telugu Voting, Rohith Naidu, Mukesh Gowda, Trigun, Ram Prasad, Krishnaudu, Varshini, Shrishti]




(9).webp)
