TeluguOne App Promotion
● # Tweets

Home

»

టీవీ

Ashureddy : వరలక్ష్మి పూజకి అషురెడ్డి వింత డ్రెస్ .. నెటిజన్లు ఫైర్!

Aug 19, 2024 11:55AM

సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒకటి ట్రెండింగ్ లో ఉంటుంది. ‌అందులోను కొంతమంది బుల్లితెర షోలలో నటించేవారు మరీను. బిగ్ బాస్ ద్వారా గుర్తింపు తెచ్చుకోవడం ఆ తర్వాత ఇన్ స్టాగ్రామ్ లో ఫోటో షూట్ లు, ప్రమోషన్స్ తో ఫుల్  బిజీ అయిపోతున్నారు. 

తాజాగా బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన  కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి. ప్రస్తుతం సినిమాల్లో గట్టిగానే ట్రై చేస్తుండగా.. అవకాశాలు కూడా  అంతంత మాత్రమే వస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో అషూ రెడ్డి పెట్టే ఫొటోలు అయితే వేరే లెవల్లో ఉంటున్నాయి. అందాల ఆరబోతలో అంతకుమించి అనేలా అషూ రెచ్చిపోతుంది. అషూ రెడ్డి మరోసారి వివాదంలో నిలిచింది. ఇటీవల ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంది అషూ. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ దీని కోసం ఆమె వేసుకున్న డ్రెస్ చూసి నెటిజన్లు ఏకేస్తున్నారు. పద్ధతిగా చీర కట్టుకొని అందరు వరలక్ష్మి వ్రతం చేసుకుంటే అషూ మాత్రం వెరైటీ ఔట్ ఫిట్ వేసింది. పేరుకి చీరే కానీ చూడటానికి మాత్రం మోడ్రన్ ఔట్ ఫిట్‌లా ఉంది. ఈ డ్రెస్‌లో పూజ దగ్గర కూర్చుని ఫొటోలకి పోజులిచ్చింది. దీంతో పూజకి ఇదేం డ్రెస్ అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

పింకీ ప్రామిస్ అనే పేరుతో షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారాయి. అషురెడ్డికి ఇన్ స్టాగ్రామ్ లో 2మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. వారిలో నెగెటివ్ కామెంట్లు చేసేవాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అయితే ఓ నెటిజన్.. ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ చేస్తే నరికేస్త ఒక్కొక్కడిని అని కామెంట్ చేయగా దానికి అషురెడ్డి.. " నువ్వు తగ్గొద్దు మావా.. వేసేయ్ అంతే " అని  రిప్లై ఇచ్చింది.  ఇక అది చూసి ఆ నెటిజన్ షాక్ అయి.. ఇది ఊహించలేదంటూ కామెంట్ చేశాడు. ఇక ఇదే పోస్ట్ కి బార్బీ గాల్.. ఉమ్మా.. అంటు స్టెల్లా రాజ్ కామెంట్ చేసింది. ఇలా కొంతమంది సెలెబ్రిటీలు కూడా ఈ పోస్ట్ కి రియాక్ట్ అవ్వడంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
 

google-ad-img