.webp)
బిగ్ బాస్ సీజన్ 10 కోసం కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. గత సీజన్ అగ్నిపరీక్ష ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ దివ్య. సీజన్ 1 లో టాప్ 15 వరకు వెళ్లి ఆడియన్స్ లో బాగా పాపులర్ అయిన వెజ్ ఫ్రైడ్ మోమో అలియాస్ దివ్య నిఖిత ఈరోజు సీజన్ 2 కి స్పెషల్ గెస్ట్ గా వచ్చింది. గత సీజన్ లో జడ్జెస్ అందరి నుండి గ్రీన్ ఫ్లాగ్స్ తెచ్చుకుని డైరెక్ట్ గా టాప్ 15 కి వెళ్లిన అమ్మాయి ఈమె. స్టేజ్ మీదకు రాగానే హోస్ట్ శ్రీముఖి.. మన వెజ్ ఫ్రైడ్ మోమో తిరిగి వచ్చేసిందని వెల్ కమ్ చెప్పింది. మెయిన్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన ఎక్స్ పీరియన్స్ తో ఈ సీజన్ కామనర్స్ కి మోటివేషన్ ఇవ్వడానికి అలాగే ఒక స్పెషల్ పవర్ ఇవ్వడానికి వచ్చానని దివ్య చెప్పింది. తను గతంలో జడ్జెస్ తో కూడా డైరెక్ట్ గా మాట్లాడిన స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సనాలిటీ కాబట్టి, ఈసారి జడ్జెస్ కూడా ఆమెకు ఫుల్ రెస్పెక్ట్ ఇచ్చారు.
దివ్య నిఖిత తనతో పాటు ఫైర్ కార్డ్ తీసుకువచ్చింది. ఈ కార్డ్ ఎవరికి ఇవ్వాలో తేల్చడానికి తను ఒక టాస్క్ పెట్టింది. సీజన్ 1 లో లాగానే బోల్డ్ టాస్కులు ఫోన్ పగలగొట్టడం, ఎలక్ట్రిక్ షాక్ తట్టుకోవడం లాంటివి గతంలో ఉన్నాయి. ఈరోజు కూడా అలాంటి డేరింగ్ టాస్క్ నే కంటెస్టెంట్లకు ఇచ్చింది. ఈ ఫైర్ కార్డ్ వల్ల గెలిచిన వ్యక్తికి డైరెక్ట్ గా నెక్స్ట్ రౌండ్ కి ఎంట్రీ లేదా ఇమ్యూనిటీ వస్తుంది. ఇది గోల్డెన్ చైర్ బ్యాటిల్ లాంటిది. ఈ కార్డ్ ని ఈజీగా ఇవ్వను, ఎవరు ఎక్కువ ఫైర్ చూపిస్తారో వాళ్లకే ఇస్తానని దివ్య చెప్పింది.
అందుకోసం టాప్ 15 నుంచి నలుగురిని సెలక్షన్ చేస్తుంది. వాళ్ళు ఎలా నామినేషన్ చేస్తారో టెస్ట్ చేసి అందులో భాగి, ప్రియాని సెలక్షన్ చేస్తుంది. అందులో భాగి విన్ అయి ఫైర్ కార్డ్ గెలుచుకొని శ్రీముఖికి ఇస్తుంది.. ఇక దివ్య అందరికి అల్ ది బెస్ట్ చెప్పేసి వెళ్ళిపోతుంది. భాగి కోసం శ్రీముఖి ఆ కార్డ్ ని ఎప్పుడు వాడుతుందో చూడాలి.





.webp)
