
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఏ దేవి వరమో నీవు Ye Devi Varamo Neevu. ఈ సీరియల్ ఆదివారం నాటి ఎపిసోడ్ 43 లో....చాలా బాగా మాట్లాడావని అంజలిని మనీష్ మెచ్చుకుంటాడు. మా అమ్మ నన్ను క్షమిస్తుందని అంజలి అనుకుంటుంది. మరొకవైపు అంజలి నీకు సారీ చెప్పి మంచి పని చేసింది అని గీతతో భాను అంటాడు. ఏం మంచి పని చేసింది. నా పరువుపోయాక, మా నాన్న పోయాక సారీ చెప్పింది. ఇప్పుడు ఏం ప్రయోజనం అని గీత కోప్పడుతుంది. ఇప్పుడు నా టెన్షన్ అంతా మా అమ్మ గురించి.. మా అన్నయ్య వాళ్ళు వెళ్ళిపోతే తనని ఎవరు చూసుకుంటారని గీత అంటుంది.
ఆ తర్వాత అమ్మని ఇంటికి తీసుకొని వద్దామని గీత అంటుంటే భాను సరే అంటాడు. మరొకవైపు శంకర్, కమల ఫారెన్ వెళ్ళడానికి సిద్ధం అవుతారు. అప్పుడే గీత ఫోన్ చేసి అమ్మ గురించి నువ్వేం టెన్షన్ పడకు నేను అమ్మని నా దగ్గరికి తీసుకొని వస్తానని అనగానే చాలా మంచి పని అని శంకర్ అంటాడు. అదే విషయం రత్నంకి చెప్తాడు. దాంతో అందరు షాక్ అవుతారు.అసలు అంజలి ఇక్కడున్న విషయమే గీతకి చెప్పలేదని కమల అంటుంది. ఆ తర్వాత రత్నం వెళ్ళిపోతుందని అంజలి గదిలోకి వెళ్లి ఏడుస్తుంది.
మరొకవైపు అంజలి ఇంటికి వెళ్ళడానికి రత్నం రెడీ అవుతుంది.రత్నం డల్ గా ఉంటుంది. అమ్మమ్మ నువ్వు మా గురించి ఏం టెన్షన్ పడకని రాఖీ అంటాడు. అప్పుడే అంజలి వస్తుంది. అంజలి నువ్వు కూడా నాతో వస్తున్నావ్ బట్టలు సర్దుకొని రా అని రత్నం అనగానే అంజలి షాక్ అవుతుంది. తరువాయి భాగంలో అంజలిని చూసి గీత షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
