Home

»

Exclusive Movie News

మిల్లీమీటర్ ఇప్పుడు సెంటీమీటర్ అయ్యాడు.. 'రావు బహదూర్' ఆచారిని గుర్తుపట్టారా? 

Jul 8, 2026 12:15PM

టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ప్రధాన పాత్రలో వెంకటేష్ మహా దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం 'రావు బహదూర్' ప్రశంసలు అందుకుంటోంది. ఒక అద్భుతమైన పోయెట్రీ తరహాలో సాగే ఈ సైకలాజికల్ డ్రామాలో ఒక కీలక పాత్ర ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు నటుడు వికాస్ ముప్పాల. సినిమాలో ఆయన పోషించిన 'డాక్టర్ ఆచారి' పాత్రకు ప్రేక్షకుల నుంచి, సినీ పరిశ్రమ వర్గాల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. తాజాగా తెలుగువన్ ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వికాస్ తన సినీ ప్రయాణం, ఈ సినిమాలో తన పాత్ర ప్రాధాన్యత గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

సినీ ఇండస్ట్రీలో వికాస్ ముప్పల ప్రయాణం ఈనాటిది కాదు. 2012లో ప్రముఖ దర్శకుడు శంకర్ రూపొందించిన 'నన్బన్' (తెలుగులో 'స్నేహితుడు') చిత్రం ద్వారా ఆయన తన కెరియర్ ప్రారంభించారు. ఆ సినిమాలో ఇలియానాతో ఆయన చెప్పిన "నన్ను ఇంకా గుర్తుపట్టలేదా.. మిల్లీమీటర్ ఇప్పుడు సెంటీమీటర్ అయ్యాను" అనే డైలాగ్ ఇప్పటికీ ఎంతో పాపులర్. 

అయితే, ఆరంభంలో కెమెరా యాక్టింగ్, థియేటర్ ఆర్ట్స్ లో మరింత పట్టు సాధించడానికి ఆయన ఐదేళ్ల పాటు గ్యాప్ తీసుకుని దాదాపు 20 షార్ట్ ఫిలిమ్స్ లో నటించి తన నటనను మౌల్డ్ చేసుకున్నారు. ఆ తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ ప్రొడక్షన్ లో వెబ్ సిరీస్ లతో పాటు తెలుగులో 'డియర్ కామ్రేడ్', 'ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్', 'పంచతంత్రం', 'పెదకాపు' వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు.

'రావు బహదూర్' సినిమాలో డాక్టర్ ఆచార్య క్యారెక్టర్ తన కెరియర్ లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ అని వికాస్ గర్వంగా చెబుతున్నారు. ఈ పాత్ర కోసం ప్రతి షెడ్యూల్ కి ముందు దర్శకుడు మహాతో కలిసి ఎన్నో వర్క్‌షాప్స్‌లో పాల్గొని, వాయిస్ మోడరేషన్, బాడీ లాంగ్వేజ్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకులు బయటకు వచ్చాక కూడా తనను గుర్తుపట్టలేనంతగా ఆ పాత్రలో లీనమైపోయానని, ఒక నటుడిగా తనకు దక్కిన అతిపెద్ద విజయం ఇదేనని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సినిమా చివర్లో వచ్చే ఒక భారీ ట్విస్ట్ కి తన క్యారెక్టరే కీలకమని, సత్యదేవ్ కి ఈక్వల్ గా సాగే ఈ రోల్ చేయడం తన బాధ్యతను మరింత పెంచిందని అన్నారు.

ఇక ఇండస్ట్రీ నుంచి ఆనంద్ దేవరకొండ, సందీప్ కిషన్, గెటప్ శ్రీను, నాగ్ అశ్విన్ వంటి ప్రముఖులు ఈ సినిమా చూసి వికాస్ నటనను ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యంగా గెటప్ శ్రీను ఫోన్ చేసి క్యారెక్టర్ డెప్త్ గురించి ప్రత్యేకంగా మాట్లాడటం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని వికాస్ పేర్కొన్నారు. 

గతంలో విజయ్ దేవరకొండ, సుహాస్, ప్రియదర్శి వంటి యాక్టర్స్ తో కలిసి పనిచేసిన అనుభవాలను గుర్తుచేసుకుంటూ, ప్రతి ఒక్కరికీ ఇండస్ట్రీలో ఒక ఓన్ రేస్, ఓన్ పేస్ ఉంటాయని, తన సమయం ఇప్పుడు వచ్చిందని నమ్ముతున్నట్లు చెప్పారు. 'రావు బహదూర్' లాంటి క్లాసిక్ సినిమాలను ఓటీటీ కోసం కాకుండా థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం చూడాలని, తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వపడేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని వికాస్ అన్నారు. 

 

 

Rao Bahadur, Vikas Muppala, Interview, TeluguOne

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com