Home

»

Exclusive Movie News

పుష్ప మూవీలో ఈ సీన్‌ని ఇక్కడి నుండే కాపీ కొట్టారా?

Jul 8, 2026 1:01PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన గ్లోబల్ బ్లాక్‌బస్టర్ చిత్రం 'పుష్ప' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేందుకు పుష్పరాజ్ ఉపయోగించే సరికొత్త ఐడియాలు, పోలీసుల కళ్లు గప్పి లారీలలో రాష్ట్ర సరిహద్దులు దాటించే సీన్లు థియేటర్లలో ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించాయి. అయితే, సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. పుష్ప సినిమాలో చూపించిన ఒక అద్భుతమైన స్మగ్లింగ్ సీన్ ఒరిజినల్ కాదని, అది ఒక పాత సినిమా నుండి కాపీ కొట్టబడింది అంటూ ఒక ఓల్డ్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న ఆ వివరాల్లోకి వెళ్తే.. కోలీవుడ్ యాక్షన్ కింగ్ విజయ్‌కాంత్ హీరోగా, రమ్యకృష్ణ, శరత్‌కుమార్, మన్సూర్ అలీ ఖాన్, రూపిత ప్రధాన పాత్రల్లో ఆర్.కె. సెల్వమణి దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'కెప్టెన్ ప్రభాకర్' (Captain Prabhakar). ఈ సినిమాకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా సంగీతం అందించారు. ఈ యాక్షన్ డ్రామాలో విలన్ మన్సూర్ అలీ ఖాన్ అడవిలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అందులో చూపించిన ఎర్రచందనం స్మగ్లింగ్ సీక్వెన్స్, లారీల చాకచక్యం, అడవి నేపథ్యంలో సాగే కొన్ని ఎపిసోడ్స్.. 'పుష్ప' చిత్రంలోని సీన్లను పోలి ఉన్నాయంటూ నెటిజన్లు ఆ ఓల్డ్ వీడియో క్లిప్‌ను విపరీతంగా షేర్ చేస్తున్నారు.

తెలుగువన్ యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ అయిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై నెటిజన్లు, సినీ అభిమానులు భిన్నమైన రీతిలో స్పందిస్తున్నారు. కొందరు సుకుమార్ లాంటి క్రియేటివ్ డైరెక్టర్ ఆ పాత సినిమా నుండి సీన్ కాపీ కొట్టారంటూ విమర్శిస్తుంటే, మరికొందరు మాత్రం దీన్ని సమర్థిస్తున్నారు. వీరప్పన్ బ్యాక్‌డ్రాప్ లేదా అడవి నేపథ్యంలో వచ్చే సినిమాలలో ఇలాంటి స్మగ్లింగ్ సీన్లు సహజంగానే ఉంటాయని, దాన్ని కాపీ అనడం కంటే ఇన్‌స్పిరేషన్ అని పిలవడం కరెక్ట్ అని అభిప్రాయపడుతున్నారు.

కథ పాతదైనా, కొన్ని సీన్ల వెనుక ఇన్‌స్పిరేషన్ ఉన్నప్పటికీ, సుకుమార్ దాన్ని తెరకెక్కించిన విధానం, అల్లు అర్జున్ తన అద్భుతమైన మేనరిజంతో పండించిన నటన అద్భుతమని ఫ్యాన్స్ చెప్తున్నారు. 

 

Allu Arjun, Pushpa Movie, Captain Prabhakar, Vijayakanth, Mansoor Ali Khan

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com