TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

బాలీవుడ్ నటులకు స్ఫూర్తి ఆ బామ్మ

Jul 11, 2014 1:11PM

 

Zohra Sehgal at young age
అలనాటి జోరా చిత్రం

 

బాలీవుడ్ అలనాటి నటి జోరా సెహెగల్ గురువారం మరణించారు. 102 ఏళ్ల జోరా గత రాత్రి న్యూఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో గుండె సంబంధ వ్యాధితో బాధ పడుతూ తుదిశ్వాస విడిచారు. నటిగానే  కాక నృత్య కళాకారిణిగా ఆమె పలుదేశాల్లో ఎంతో పేరు గడించారు.

చీనికమ్ చిత్రంలో జోరా అమితాబ్ తల్లిగా నటించారు. అలాగే ఐశ్వర్య బామ్మగా హమ్ దిల్ దేచుకే సనమ్ చిత్రంలో నటించారు. 1946 ధర్తి కే లాల్ చిత్రం నుంచి మొదలు పెట్టి 2007 సావరియా వరకు దాదాపు అరవై ఏళ్ల పాటు ఆమె సినీ రంగంలో నటిగా అనేక పాత్రలు పోషించారు.

 

zohra inspiration to kareena

 

ఎంతో మందికి ఇష్టమైన బామ్మ జోరా. కరీనా లాంటి నేటి తరం హీరోయినలకు ఆమె స్ఫూర్తి అంటే నమ్మక తప్పదు. 90 దాటినా జోరాలా సినిమాల్లో నటిస్తా అని కరీనా ఓ సందర్భంలో చెప్పటం చూస్తే ఆమె నటిగా బాలీవుడ్ లో ఎంతటి ముద్ర వేశారో అర్థమవుతుంది.  95 సంవత్సరాల వయసు వచ్చే వరకూ ఆమె చిత్రాల్లో నటిస్తు ఉండటం విశేషం.

సుదీర్ఘకాలం సినీ రంగానికి ఆమె అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ, పద్మభుషణ్, పద్మ విభూషణ్ అవార్డులు అందించారు. ఆమె మరణం పట్ల అమితాబ్ సహా సినీరంగానికి సంబధించిన పలువురు సంతాపం  ప్రకటించారు. దేశ ప్రధాని నరేంద్రమోడి, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆమె మరణం పట్ల సంతాపాన్ని తెలిపారు. 

google-ad-img