TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

ఆ ఓటమి నా గుండెను చీల్చింది - ధనుష్

Jul 10, 2014 6:47PM

 

Dhanush Heart Breaks


జర్మనీ చేతిలో  బ్రెజిల్ ఓటమి  నా గుండెను ముక్కలు చేసింది అంటూ బాధ పడ్డారు హీరో ధనుష్. ఫుట్‌బాల్ ప్రేమికులెంతో మంది ఫిఫా వరల్డ్ కప్-2014లో బ్రెజిల్ ఓటమి చూసి తీవ్ర వ్యథకు గురయ్యారు. అందులో తమిళ హీరో ధనుష్ కూడా చేరారు. బ్రెజిల్ ఓటమి నా చూసి నా గుండె పగిలింది అంటూ ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆ మ్యాచ్ చూసి చాలా బాధ కలిగిందని, హృదయం ముక్కలయ్యేందని తన బాధను పంచుకున్నారు. బ్రెజిల్ ఓడిపోయినా తాను బ్రెజిల్ అభిమానిగానే వుంటానని పేర్కొన్నారు. మంగళవారం జరిగిన మ్యాచ్ లో బ్రెజిల్ జర్మనీ చేతులో 7-1 తేడాతో ఓడిన సంగతి తెలిసిందే.  తాను నటించిన చిత్రాలు అపజయం పాలైనప్పుడు కూడా  ధనుష్ ఈ విధంగా స్పందించక పోయి వుండవచ్చు.

google-ad-img