Home

»

Latest News

బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ: యూట్యూబర్ నందన కేసులో సంచలన నిజాలు.. అంతా ఆయనే చేశాడా.?

Sep 9, 2026 12:00PM

'నందూస్ వరల్డ్' పేరుతో సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న యూట్యూబర్ నందన వ్యవహారం ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతోంది. 'డెస్టినీ కన్సల్టెన్సీ' పేరుతో విదేశాల్లో ఉద్యోగాలు, లండన్ వీసాలు ఇప్పిస్తానంటూ లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసం చేశారనే ఆరోపణలతో ఆమె తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. 

తన నుంచి రూ. 15 లక్షలు వసూలు చేసి మోసం చేశారంటూ క్రాంతికుమార్ అనే బాధితుడి ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో లుక్ అవుట్ నోటీసుల ఆధారంగా నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు, తాజాగా ఆమెను విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో విచారించారు.

విచారణ సమయంలో "నాకు ఏమీ తెలియదు.. ఆ డెస్టినీ కన్సల్టెన్సీకి సంబంధించిన లావాదేవీలన్నీ నా భర్త మధుకర్, మా అకౌంటెంట్‌ మాత్రమే చూసుకుంటారు" అంటూ నందన చెప్పినట్లు సమాచారం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్సై రాజు ఆధ్వర్యంలో దాదాపు నాలుగు గంటల పాటు నందనను క్షుణ్ణంగా ప్రశ్నించారు. ఈ విచారణకు నందన తన తల్లి, లాయర్లతో కలసి హాజరయ్యారు. అయితే, కొన్ని కీలకమైన ప్రశ్నలకు ఆమె సరిగ్గా సమాధానాలు చెప్పకపోవడంతో పోలీసులు ఆమెకు మళ్లీ నోటీసులు జారీ చేసి, ఈ నెల 16న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.

ఇదే సమయంలో పోలీస్ స్టేషన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన పలువురు బాధితులు తమను కూడా నందన దంపతులు లండన్ వీసాల పేరుతో మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే విచారణ కవరేజ్ కోసం వచ్చిన మీడియా ప్రతినిధులతో నందన లాయర్లు వాగ్వాదానికి దిగడంతో కొంతసేపు గందరగోళం ఏర్పడింది. ఆ తర్వాత లాయర్లు క్షమాపణలు చెప్పడంతో పరిస్థితి సర్దుమణిగింది.

అయితే, సోషల్ మీడియాలో మరో ఊహాగానం జోరుగా నడుస్తోంది. లండన్‌లోనే ఉన్న నందన హఠాత్తుగా ఇండియాకి ఎందుకు వచ్చారు అనే ప్రశ్నకు "ఆమె బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇద్దామనే ప్లాన్‌తోనే వచ్చారు" అని రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. లాయర్లను సంప్రదించి, అన్ని చర్చించిన తర్వాతే ఆమె ఇండియాకు వచ్చారని అంటున్నారు. విచారం పూర్తయిన కొద్దిరోజులకు ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమని టాక్ నడుస్తోంది. 

 

 

 

[Nandus World Nandana, Youtuber Nandana, Bigg Boss Telugu 10, Nandus World Case, Nandus World Couple Scam, Nandana Visa Scam, Visa Fraud Case, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com