
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రానున్న పాన్ ఇండియా మూవీ 'రాకా'పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ట్రేడ్ వర్గాల్లో ఇప్పుడు ఈ మూవీ బడ్జెట్, బన్నీ రెమ్యునరేషన్ గురించి హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. అసలు అల్లు అర్జున్ ఈ సినిమాకి ఫిక్స్డ్ రెమ్యునరేషన్ కాకుండా ఒక మైండ్ బ్లోయింగ్ ప్లాన్ వేశారని తెలుస్తోంది.
సాధారణంగా ఏ స్టార్ హీరో అయినా సినిమా మొదలవడానికి ముందే తమ రెమ్యునరేషన్ సెటిల్ చేసుకుంటారు. కానీ అల్లు అర్జున్ మాత్రం 'రాకా' మూవీకి పూర్తి భిన్నమైన రూట్ ఎంచుకున్నారు. ఫిక్స్డ్ పారితోషికం తీసుకునే బదులు, ప్రాఫిట్ షేరింగ్ పద్ధతికి మొగ్గు చూపినట్లు టాక్ వినిపిస్తోంది. అంటే సినిమా విడుదలయ్యాక వచ్చే లాభాల్లో వాటా బన్నీ ఖాతాలోకి వెళ్తుంది.
ఒకవేళ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో బంపర్ హిట్ కొడితే, ప్రాఫిట్ షేరింగ్ ద్వారా అల్లు అర్జున్ అందుకునే మొత్తం ఏకంగా*రూ. 300 కోట్లకు చేరుకునే అవకాశం ఉందట. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక హీరో ఒకే సినిమాకి ఇంతటి భారీ స్థాయిలో ప్రాఫిట్ షేరింగ్ అందుకోవడం డెఫినెట్‌గా ఒక రేర్ రికార్డ్ అనే చెప్పాలి.

అయితే బన్నీ ఈ డిసిషన్ తీసుకోవడానికి ఒక బలమైన కారణం ఉంది. 'రాకా' సినిమాను ప్రొడక్షన్ పరంగా ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా సన్ పిక్చర్స్ బ్యానర్‌పై అత్యంత భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ ఏకంగా రూ. 600 కోట్లు ఉంటుందని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ దశలోనే దాదాపు 50 శాతం బడ్జెట్ పూర్తయిందని ప్రచారం సాగుతోంది.
ఇంత భారీ ప్రాజెక్ట్ నిర్మించే సమయంలో ప్రొడ్యూసర్లపై అదనంగా ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతో, బన్నీ తన అడ్వాన్స్ రెమ్యునరేషన్‌ను పక్కన పెట్టి ప్రాఫిట్ షేరింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇది కేవలం ఆయన కాన్ఫిడెన్స్ మాత్రమే కాదు, నిర్మాతకు ఇచ్చే బిగ్గెస్ట్ సపోర్ట్ కూడా.
హాలీవుడ్ లెవెల్ అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నారు. ఒక హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం, ఇండియాలోనే కాకుండా గ్లోబల్ మార్కెట్‌లోనూ సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
[Allu Arjun Remuneration, Allu Arjun 300 Crore, Raaka Remuneration, Raaka Movie, Profit Sharing, Raaka Budget, Telugu Film News, Telugu News]





