
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'ది ప్యారడైజ్'. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన 'ఏష నాగుల కట్ట మీద' పాట సంచలనాలు సృష్టిస్తోంది. టాలీవుడ్ చరిత్రలోనే యూట్యూబ్ లో వేగంగా 50 మిలియన్ వ్యూస్ సాధించిన పాటగా రికార్డు సృష్టించింది. కేవలం 4 రోజుల 15 గంటల్లోనే ఈ ఫీట్ ను సాధించడం విశేషం.
'చుట్టమల్లే' లాంటి బిగ్గెస్ట్ చార్ట్‌బస్టర్స్ సహా ఎన్నో పాటల రికార్డులను ఈ ఊరమాస్ జానపద పాట అధిగమించింది. ఆగస్టు 29న విడుదలైన ఈ ట్రాక్, రిలీజ్ అయిన క్షణం నుంచే శ్రోతలను తన వైబ్ తో కట్టిపడేసింది. అనిరుధ్ తన మార్క్ మాస్ టచ్ తో ఈ ఫోక్ సాంగ్ ను మరోస్థాయికి తీసుకెళ్లారు. తెలంగాణ మట్టివాసన కలిగిన జానపద గాయకులు ప్రభ బంగారిగళ్ళ, అడ్డుల జంగిరెడ్డి తమ గాత్రంతో ప్రాణం పోశారు. ఇక ప్రముఖ గీత రచయిత కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్ ప్రతి ఒక్కరి నోటా నానుతూ, ప్రతీ రీల్‌కి పక్కా ఆడియోగా మారిపోయాయి.
క్యాచీ హుక్ స్టెప్స్, ఈజీ డ్యాన్స్ మూవ్స్ ఉండటంతో ఇంస్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ లో ఎక్కడ చూసినా ఈ పాట మారుమోగిపోతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా ఈ మాస్ వైబ్‌కి ఫిదా అయిపోయి స్టెప్పులేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ 'ఆయా షేర్' 200 మిలియన్లకు పైగా వ్యూస్‌తో నేషనల్ వైడ్‌గా దుమ్మురేపగా, ఇప్పుడు 'ఏష నాగుల' పాట దాన్ని మించిన జోరును ప్రదర్శిస్తోంది.
ఈ రెండు పాటల సంచలనం చూస్తుంటే, సుధాకర్ చెరుకూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'ది ప్యారడైజ్' చిత్రంపై అంచనాలు ఎక్కడికో వెళ్ళిపోయాయి. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతున్న ఈ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రాబోతోంది.
[Yesha Nagula Song, The Paradise Movie, Aaya Sher Song, Natural Star Nani, Anirudh Ravichander, Keerthy Suresh, Srikanth Odela, Telugu Film News, Telugu News]




.webp)
