Home

»

Latest News

రష్మిక షాకింగ్ కామెంట్స్: మూడు నెలల పాటు విజయ్, రష్మిక దూరంగా ఉన్నారా! 

Sep 3, 2026 3:13PM

 

 

అభిమానుల ఆశలు, ప్రార్థనలు ఫలించి విజయ్ దేవరకొండ, రష్మిక వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.  కెరీర్ పరంగా ఇద్దరు బిజీగా ఉన్నారు. అయితే  కొన్ని రోజుల క్రితం 'మైసా' షూటింగ్ లో గాయాలపాలవ్వడంతో రష్మిక ప్రస్తుతం రెస్ట్  మోడ్ లో ఉంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఇచ్చిన  ఒక ఇంటర్వ్యూ లో తమ వివాహం తర్వాత జరిగిన విషయాలు చెప్పడంతో ఇప్పుడు అభిమానులు షాక్ కి గురయ్యే పరిస్థితి.

  రష్మిక మాట్లాడుతు 'పెళ్లయిన తర్వాత దాదాపు 3 నెలల పాటు నేను, విజయ్ ఒకరినొకరం నేరుగా చూసుకోలేదు.నిరంతరం సినిమాల షూటింగ్‌లు, అవుట్‌డోర్ షెడ్యూల్స్, ప్రయాణాల వల్ల పని ఒత్తిడిలో ఉండిపోయాం. కేవలం ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ ద్వారా మాత్రమే పలకరించుకునే వాళ్ళం. అయితే ‘మైసా’ షూటింగ్ లో గాయమవడంతో  డాక్టర్లు  కొన్నివారాల పాటు కదలకుండా విశ్రాంతి తీసుకోమని సూచించారు. కెరీర్ ప్రారంభించిన దాదాపు 8 ఏళ్ల తర్వాత  ఇన్ని రోజులు ఒకే చోట ఇంట్లోనే ఉండటం ఇదే తొలిసారి.

 


Also Read: జైలర్ 2 రిలీజ్ డేట్ వచ్చేసింది: ఆ డేట్ కి ఉన్న స్పెషల్ ఇదే 

ఈ విశ్రాంతి సమయాన్ని  ఒక రకమైన ఆశీర్వాదంగానే భావించాను . "మా ఇద్దరికీ పెళ్లి తర్వాత ఎక్కువ సమయం గడిపే అవకాశం దక్కలేదు, అందుకే ఆ దేవుడే లేదా విశ్వమే నన్ను ఇంట్లో కూర్చోబెట్టి విజయ్‌తో సమయాన్ని గడిపేలా ప్లాన్ చేసిందేమో" అని ఆమె సంతోషంగా చెప్పుకొచ్చారు. ఈ బ్రేక్ వల్ల పెళ్లయిన 6 నెలల తర్వాత మొదటిసారిగా ఇద్దరూ కలిసి ఇంట్లో ఒకరికొకరు సమయాన్ని కేటాయించుకుని క్వాలిటీ టైమ్ గడిపినట్లు వివరించారు.  

 

[ Rashmika Mandanna, Vijay Deverakonda, Three months, Rashmika Injury, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood, Tollywoodnews ] 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com