TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

‘వృషకర్మ’ ట్రైలర్‌: అసలు ఊహించలేదు.. పాన్ ఇండియా షేక్ అవుతుందేమో.!

Nov 26, 2026 9:58AM

నాగచైతన్య నుంచి ఇలాంటి సినిమా వస్తుందని చాలామంది ఊహించి ఉండరు. ఇప్పటివరకు వచ్చిన గ్లింప్స్‌, పోస్టర్లతో కొంత ఆసక్తి పెంచిన ‘వృషకర్మ’.. ఇప్పుడు ట్రైలర్‌తో అసలు కథా ప్రపంచం ఎలా ఉండబోతోందో చూపించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ఇందులోని మిస్టరీ, విజువల్స్‌, విలన్‌ పాత్ర చూస్తుంటే ఈసారి చైతూ కొత్త జానర్‌లో గట్టిగానే ప్రయత్నించినట్లు అనిపిస్తోంది.

ఈ సినిమాలో నాగచైతన్య అర్జున్‌ అనే ట్రెజర్‌ హంటర్‌ పాత్రలో కనిపించబోతున్నారు. తవ్వకాల్లో బయటపడ్డ ఒక గుహలో 5 వేల ఏళ్ల నాటి గుర్తులు కనిపిస్తాయి. వేల సంవత్సరాల నాటి రహస్యాన్ని ఛేదించడానికి అర్జున్ రంగంలోకి దిగుతాడు. 

దాదాపు 5 వేల ఏళ్ల చరిత్ర ఉన్న ఓ అతీంద్రియ శక్తి చుట్టూ ఈ కథ తిరుగుతున్నట్లు ట్రైలర్‌ ద్వారా అర్థమవుతోంది. వేద విజ్ఞానం, పురాతన రహస్యాలు, మిస్టరీ.. ఈ మూడింటినీ కలిపి దర్శకుడు కార్తీక్‌ దండు ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించినట్లు కనిపిస్తోంది.

నాగచైతన్య పాత్ర కేవలం నిధుల కోసం వెతికే వ్యక్తిగా మొదలై, ఆ తర్వాత ఊహించని ప్రమాదాల్లో చిక్కుకునేలా ఉంది. ఆ గుహ వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఆ పురాతన శక్తికి, అర్జున్‌కు ఉన్న సంబంధం ఏమిటి? అనేవి సినిమా మీద ఆసక్తిని పెంచుతున్నాయి.

ఇది కూడా చదవండి: ‘నాన్న కుట్టి’ ట్రైలర్.. కూతురి కోసం ప్రాణాలైనా ఇచ్చే తండ్రి కథ.!

ఇక ఈ సినిమాలో స్పర్శ్‌ శ్రీవాస్తవ విలన్‌గా కనిపించబోతున్నారు. ‘లాపతా లేడీస్‌’తో గుర్తింపు తెచ్చుకున్న స్పర్శ్‌ను ఇలాంటి భయంకరమైన పాత్రలో చూడటం కొత్తగా ఉంది. ఆయన గెటప్‌, బాడీ లాంగ్వేజ్‌ చూస్తుంటే ఈ సినిమాలో విలన్‌ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉన్నట్లు అనిపిస్తోంది.

‘విరూపాక్ష’తో హారర్‌ థ్రిల్లర్‌ జానర్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కార్తీక్‌ దండు.. ఇప్పుడు అంతకంటే పెద్ద ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు. అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం, రఘుల్‌ ధేరియన్‌ సినిమాటోగ్రఫీ, నవీన్‌ నూలి ఎడిటింగ్‌ ఈ ప్రాజెక్టులో కీలకంగా ఉన్నాయి.

మొత్తానికి ‘వృషకర్మ’ ట్రైలర్‌ చూస్తుంటే ఇది సాధారణమైన యాక్షన్‌ సినిమా కాదని అర్థమవుతోంది. పురాతన రహస్యాలు, వేద విజ్ఞానం, అడ్వెంచర్‌, భయపెట్టే విలన్‌.. ఇలా అన్నీ కలిపి ఓ కొత్త సినిమాటిక్‌ ప్రపంచాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

డిసెంబర్‌ 4న ‘వృషకర్మ’ థియేటర్లలోకి రాబోతోంది. నాగచైతన్యకు ఈ సినిమా కొత్త గుర్తింపును తీసుకొస్తుందా? ‘విరూపాక్ష’ తర్వాత కార్తీక్‌ దండు మరోసారి ప్రేక్షకులను తన ప్రపంచంలోకి తీసుకెళ్లగలరా? చూడాలి.

మీకు నచ్చవచ్చు:
బాహుబలి కాంబో రిపీట్‌.. వారణాసి తర్వాత ప్రభాస్‌తో రాజమౌళి సినిమా.!
‘భోగి’కి A సర్టిఫికెట్.. సెన్సార్ టాక్ ఎలా ఉందంటే.?

 

 

 

[Vrushakarma Trailer, Naga Chaitanya, Meenakshi Chaudhary, Sparsh Srivastava, Karthik Dandu]

 

google-ad-img