Home

»

Latest News

Vishnu Vinyasam Movie Review : విష్ణు విన్యాసం మూవీ రివ్యూ

Feb 27, 2026

 

-సినిమా పేరు: విష్ణు విన్యాసం 
-న‌టీన‌టులు: శ్రీ విష్ణు,నయన్ సారిక, సత్య, గోపరాజు రమణ, మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగర్, -బ్రహ్మాజీ తదితరులు
-సినిమాటోగ్ర‌ఫీ: సాయి శ్రీరామ్ 
-మ్యూజిక్: రాధన్
-నిర్మాత‌: సుమంత్ నాయుడు 
-బ్యానర్:  శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్
-రచన, దర్శకత్వం: యదునాధ్ మారుతీ రావు
-రిలీజ్ డేట్ : ఫిబ్రవరి 27 , 2026 

సింగిల్ మూవీ తో హీరో మెటీరియల్ రేంజ్ ని పెంచుకున్న 'శ్రీ విష్ణు'(Sree Vishnu)ఈ రోజు 'విష్ణు విన్యాసం'(vishnu Vinyasam)తో థియేటర్స్ లో అడుగుపెట్టాడు. ఆయ్ మూవీ భామ 'నయన్ సారిక' (Nayan Sarika)హీరోయిన్ కావడం, ప్రచార చిత్రాలు బాగుండటంతో మూవీపై మంచి హైప్ నెలకొని ఉంది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ

విష్ణు(శ్రీ విష్ణు).. వాస్తు, వార ఫలాలు, జాతకాలతో డైలీ లైఫ్ ముగించే వ్యక్తి.. థర్టీ ఇయర్స్ దాటినా పెళ్లి అవ్వకపోవడానికి ఆ నమ్మకాలే కారణం.జూనియర్ లెక్చరర్ గా వర్క్ చేస్తుంటాడు. మనీషా (నయన్ సారిక). అందమైన అమ్మాయి. ఎన్నిపెళ్లి సంబంధాలు వచ్చినా సెట్ అవ్వవు. తను చెప్పే ఒక విషయంతో పెళ్లి చేసుకోకుండా వెళ్లిపోతుంటారు. ఆ దిగులుతో సిగరేట్, ఆల్కహాల్ అలవాటు చేసుకుంటుంది. విష్ణుకి ఫ్యాకల్టీ గా వస్తుంది. అంటే సీనియర్ లెక్చరర్ గా. మనీషా కి సిగరెట్, ఆల్కహాల్ కూడా సప్లై చేస్తుంటాడు. నువ్వు లేకుండా నేనుండలేనని మనీషా కి ఐలవ్ యు కూడా చెప్తాడు.మనీషా కూడా ఐ లవ్ యు చెప్తుంది. ఆ తర్వాత తనతో పెళ్లి జరిగితే ఏం జరుగుతుందో అనే  సీక్రెట్ చెప్తుంది. దీంతో మనీషా ని పెళ్లి చేసుకోవాలా లేదా అనే ఆలోచనలో పడతాడు. మనీషా చెప్పిన సీక్రెట్ ఏంటి? తనని పెళ్లి చేసుకోవాలని వచ్చిన వాళ్ళు ఎందుకు పారిపోయారు. మనీషా, విష్ణు మధ్య అసలు ప్రేమ ఉందా! చివరకి ఆ ఇద్దరు పెళ్లి చేసుకున్నారా? లేదా అనేదే కథ

ఎనాలసిస్ 
ప్రస్తుత సినీ రోజుల్లో ఇలాంటి స్టైల్ ఆఫ్ కథలు వస్తాయని ఊహించలేం. కాకపోతే ఎంటర్ టైన్మెంట్, విష్ణు, మనీషా పెర్ఫార్మ్ వర్క్ అవుట్ అవడంతో ఒక మాదిరి ఆనందంతో థియేటర్ నుంచి బయటకి వస్తాం. ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే మనీషా ఇంట్రడక్షన్ సీన్ తో సినిమా ఎలా తెరకెక్కబోతుందనే క్యూరియాసిటీ వచ్చింది. కానీ ఆ తర్వాత విష్ణు ఇంట్రడక్షన్ తో పాటు, విష్ణు లైఫ్ లోకి మనీషా రాకముందు వరకు జరిగిన సీన్స్ అన్ని రొటీన్. విష్ణు, మనీషా పరిచయంతో పాటు, ఆ ఇద్దరి మధ్య నడిచిన కథనం, ఆ  సందర్భంగా వచ్చిన డైలాగ్స్ సూపర్. ఒకటే నవ్వులు పూయించాయి. సినిమా మొత్తంపై ఆ సన్నివేశాలే హెలైట్  అని చెప్పవచ్చు.సత్య నుంచి వచ్చిన కామెడీ వర్క్ అవుట్ కాలేదు.ఇంటర్ వెల్ తో పాటు దాని చుట్టూ అల్లుకున్న ఎపిసోడ్ మొత్తం బాగుంది. మనీషా ఫ్యామిలీ ఏదో రహస్యాన్ని దాస్తుందనే డౌట్ ని ఫస్ట్ హాఫ్ లోనే బాగా ఎస్టాబ్లిష్ చేయాల్సింది. సెకండ్ హాఫ్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ మేకర్స్ ఆ క్యూరియాసిటీ ని ఓల్డ్ ఫార్మేట్ తో అల్లుకున్న సీన్స్ తో ముగించేశారు. సెకండ్ హాఫ్ నే మైనస్, విష్ణు మొదట నుంచి చాలా తెలివైన వ్యక్తి కాబట్టి మనీషా ఫ్యామిలీ యొక్క ప్లాన్ ని కనిపెట్టి  మనీషా ఏ విషయంలో భయపడుతుందో, ఆ విషయాన్నీ సంతోషంగా స్వీకరిస్తానని చెప్పి, మనీషా ఫ్యామిలీ ని ఒక ఆట ఆడుకునే ప్రాసెస్ లో విష్ణు తరహా బాడీ లాంగ్వేజ్ తో ఎంటర్ టైన్ మెంట్ కోణంలో చెప్పి ఉంటే సినిమా రేంజ్ మరోలా ఉండేది. మనీషా కి తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న కుటుంబసభ్యుల చెడు ప్లాన్ గురించి కూడా తెలియనివ్వకూడదు. ప్రేమ అంటే అదే కదా..            

నటీనటులు, సాంకేతిక నిపుణుల పని తీరు
 
విష్ణు గా శ్రీ విష్ణు మరోసారి తన మేనరిజం తో సిల్వర్ స్క్రీన్ ని చెడుగుడు ఆడుకున్నాడు.నా కోసం థియేటర్ కి రండి మీకు ఎంటర్ టైన్ మెంట్ విషయంలో ఎలాంటి లోటు ఉండదనే టైప్ లో కాంప్రమైజ్ కానీ విధంగా లాఫింగ్ థెరపీ చేసేలా చేసాడు. మనీషా గా నయన్ సారిక కూడా అంతే. శ్రీ విష్ణుకి పోటాపోటీగా పెర్ఫార్మ్ ప్రదర్శించింది. సెంటిమెంట్, లవ్ సీన్స్ లో తనకి మరోసారి ఎదురులేదనే హింట్ ని ఒక రేంజ్ లోనే ఇచ్చింది. మిగతా క్యారెక్టర్స్ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. రాధన్ మ్యూజిక్ ని వచ్చిన సాంగ్స్ లో మెరుపులు లేవు. బిజి ఏం బాగుంది.సాయి శ్రీరామ్  ఫొటోగ్రఫీ బాగుంది. యదునాధ్ మారుతీ రావు దర్శకుడిగా పర్లేదు కానీ రచయితగా ఫెయిల్ అయ్యాడని చెప్పవచ్చు.స్క్రిప్ట్ పై మరింత  శ్రద్ద చూపించాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి 

టోటల్ గా చూస్తే ఫస్ట్ హాఫ్ తో పాటు శ్రీ విష్ణు, నయన్ సారిక పెర్ఫార్మ్, ఎంటర్ టైన్ మెంట్  సూపర్. సెకండ్  హాఫ్ మైనస్.

బలాలు
1 .శ్రీ విష్ణు పెర్ ఫార్మెన్స్ 
2 .నయన్ సారిక పెర్ ఫార్మెన్స్ 
3 . కామెడీ 
4 . డైరెక్షన్ 

బలహీనతలు
1 కథలో కొత్త ధనం లేకపోవడం
2 .గ్రిప్ లేని స్క్రీన్ ప్లే 
౩. సెకండ్ హాఫ్ 
4 . ప్రీ క్లైమాక్స్ 
5 . క్లైమాక్స్  


రేటింగ్ 2 .25 /5 
                                                                                                     అరుణాచలం 
 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com