Home

»

Latest News

హీరో సత్యదేవ్ కి సర్జరీ.. షూటింగ్ లో గాయపడటంతో...

Feb 27, 2026

విభిన్న చిత్రాలు, పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు నటుడు సత్యదేవ్(Satyadev). ప్రస్తుతం ఆయన చేతిలో 'రావు బహదూర్', 'ఫుల్ బాటిల్', 'గరుడ' వంటి ఆసక్తికర సినిమాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల మూవీ షూటింగ్ లో సత్యదేవ్ గాయపడినట్లు తెలుస్తోంది. 

వారం రోజుల క్రితం ఓ సినిమా షూటింగ్ లో సత్యదేవ్ గాయపడ్డాడట. ఒక యాక్షన్ సీన్ చిత్రీకరణలో పాల్గొంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈరోజు సత్యదేవ్ కి డాక్టర్లు మైనర్ సర్జరీ చేసినట్లు సమాచారం.

గాయం తీవ్రంగా లేకపోయినా, పూర్తి స్థాయిలో వేగంగా కోలుకోవడానికి సర్జరీని డాక్టర్లు సూచించారట. డాక్టర్ల సూచన మేరకు నేడు సత్యదేవ్ సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆయన మళ్లీ షూటింగ్‌లో పాల్గొనే అవకాశముంది.

Also Read: బాలయ్య పాటలు వింటూ లారీని గుద్దేశా.. 'విష్ణు విన్యాసం' నిర్మాత షాకింగ్ కామెంట్స్!

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com