తెలుగులో బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'విక్రాంత్ రోణ'!
on Aug 1, 2022
గత కొద్ది వారాలుగా టాలీవుడ్ నుంచి వస్తున్న సినిమాలు వరుసగా పరాజయం పాలవుతుంటే అనూహ్యంగా కన్నడ మూవీ 'విక్రాంత్ రోణ' తెలుగులో విజయం సాధించింది. రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా నాలుగు రోజుల్లో తెలుగు డబుల్ ప్రాఫిట్స్ తీసుకొచ్చింది.
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ నటించిన పాన్ ఇండియా మూవీ 'విక్రాంత్ రోణ' జూలై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ డివైడ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.1.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి మొదటిరోజే రూ.1.02 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. రెండో రోజు 36 లక్షలు, మూడో రోజు 53 లక్షల షేర్ వసూలు చేసిన ఈ మూవీ నాలుగో రోజు దాదాపు ఫస్ట్ డే అంత కలెక్ట్ చేసింది. 29న విడుదలైన 'రామారావు ఆన్ డ్యూటీ'కి నెగటివ్ టాక్ రావడంతో పాటు నాలుగో రోజు ఆదివారం కావడంతో ఏకంగా రూ.1.01 కోట్ల షేర్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లో 2.92 కోట్ల షేర్(5.80 కోట్ల గ్రాస్) వసూలు చేసి మంచి లాభాలతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
వరల్డ్ వైడ్ గా రూ.50 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ ఇప్పటిదాకా రూ.35.70 కోట్ల షేర్(67.45 కోట్ల గ్రాస్) రాబట్టింది.
Also Read