Home

»

Latest News

విజయ్ సేతుపతి,  శృతి హాసన్ ట్రైన్ రిలీజ్ డేట్ వచ్చేసింది: ఫ్యాన్స్ సంబరాలు!

Oct 13, 2026 4:28PM


మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన తాజా చిత్రం 'ట్రైన్' (Train). ప్రముఖ దర్శకుడు మిస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ చాలా రోజుల క్రితమే షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంది. కానీ రిలీజ్ డేట్ పై స్పష్టత రాకపోతుండటంతో ఫ్యాన్స్, సినీ ప్రేమికులు డీలా పడుతూ వస్తున్నారు.  


ఇప్పుడు డిసెంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ వార్తతో అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొని ఉంది. విజయ్ సేతుపతి సరసన  శృతి హాసన్ హీరోయిన్ కాగా 2020లో వచ్చిన 'సైకో' సినిమా తర్వాత దర్శకుడు మిస్కిన్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో 'ట్రెయిన్' పై ఆసక్తి తారాస్థాయికి చేరుకుంది. ఈ సినిమా ప్రకటన నవంబర్ 2023లో వెలువడగా, అదే ఏడాది డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంది. 

ఇది కూడా చదవండి: హీరోల పబ్లిసిటీ సరిహద్దులు: సోషల్ మీడియా నిరంతర సాన్నిహిత్యం, స్టార్‌డమ్‌కి వరమా? శాపమా!

 

 

యు/ఎ' (U/A) సర్టిఫికెట్ లభించిందని సమాచారం. విశేషం ఏమిటంటే, ఈ సినిమాతో దర్శకుడు మిస్కిన్ పూర్తిస్థాయి సంగీత దర్శకుడిగా కూడా పరిచయమవుతున్నారు. తనదైన డార్క్ థ్రిల్లర్ జోనర్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసే మిస్కిన్, ఈ చిత్రంలో రైలు నేపథ్యంలో సాగే ఉత్కంఠభరితమైన కథనాన్ని తెరకెక్కించారు. ఒక సాధారణ రైలు ప్రయాణం ఊహించని ప్రమాదాలమయం కావడం, అందులో కూరుకుపోయిన ప్రయాణికుల మానసిక సంఘర్షణల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.   సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లు మరియు టీజర్‌లు ఇప్పటికే సోషల్ మీడియాలో రికార్డు స్థాయి వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. వీ క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్. థాను ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు.

 

[Vijay Sethupathi Train Movie Release Date, Vijay Sethupathi, Train movie, Mysskin director, Shruti Haasan, December 4 release,Telugu Cinema, TeluguCinema News, Tollywood, Tollywood News]

 

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com