విజయ్ సేతుపతికి అరుదైన గౌరవం: ఆనందంతో పొంగిపోతున్న తెలుగు ఫ్యాన్స్!
Nov 24, 2026 11:02AM
.webp)
మక్కల్ సెల్వం హోదాలో విజయ్ సేతుపతి సెల్యులాయిడ్ పై పెర్ఫార్మ్ చేస్తుంటే నాన్ స్టాప్ గా విజిల్స్ మోగాల్సిందే. ఆ అభిమానులు కదా విజిల్స్ వేసేది అనుకోకండి.. ఎంతో ప్రేక్షకులు తమ ముఖాలు కనపడకుండా విజిల్స్ వేస్తారు. ఆ తమిళనాట అలాగే ఉంటుందిలే అనుకోకండి. తెలుగు నాట కూడా అదే పరిస్థితి.ఉప్పెన మూవీకి అయితే హైదరాబాద్ లో చాలా థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ బ్యానర్స్ కూడా కట్టారు. అది మక్కల్ రేంజ్.
ఈ ట్రాక్ రికార్డు గుర్తించే 54వ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల వేడుక సేతుపతిని ఆహ్వానించింది. సదరు ఎమ్మీ అవార్డ్స్ లో ప్రజెంటర్‌గా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ నెల 23న అంటే నిన్న న్యూయార్క్‌లోని హిల్టన్ మిడ్‌టౌన్‌లో 54వ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది.
ప్రపంచవ్యాప్తంగా టెలివిజన్, వెబ్ కంటెంట్ రంగాల్లో ప్రతిభ చూపిన వారికి ఈ అవార్డులని అందించారు. విజయ్ సేతుపతి ప్రజెంటర్‌గా బ్లాక్ కలర్ అవుట్‌ఫిట్‌లో గోల్డ్ ఎంబ్రాయిడరీతో ఉన్న బ్లేజర్ ధరించి రెడ్ కార్పెట్‌పై ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.అయితే ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఉంది. విజయ్ సేతుపతి తొలి భారతీయ ఎమ్మీ ప్రజెంటర్ అంటూ కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ అది నిజం కాదు.
.webp)
గతంలో 2009లో ఆశ్కా గోరాడియా, 2010లో సిమోన్ సింగ్, 2012లో ప్రేరణ వాన్వారీ కూడా ఈ అవార్డుల వేడుకలో ప్రజెంటర్లుగా వ్యవహరించారు. దీంతో విజయ్ సేతుపతి తొలి భారతీయ ప్రజెంటర్ కాకపోయినా.. ఈ ప్రతిష్టాత్మక వేదికపై మరోసారి భారతీయ ప్రతిభకు గుర్తింపు తీసుకొచ్చారు.
ఇది కూడా చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న నయనతార 'మహాశక్తి'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
ఎమ్మీ అవార్డుల్లో 22 దేశాలకి చెందిన 64 నామినేషన్స్ 16 విభాగాల్లో పోటీపడ్డాయి. ఈ వేడుకకు హాలీవుడ్ నటుడు మైఖేల్ యూరీ హోస్ట్‌గా వ్యవహరించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ నటీనటులు, దర్శకులు, నిర్మాతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈసారి భారత్ నుంచి రెండు ఎంట్రీలు అవార్డుల బరిలో నిలిచాయి. అందులో మొదటిది ప్రముఖ కమెడియన్ వీర్ దాస్ నటించిన నెట్‌ఫ్లిక్స్ కామెడీ స్పెషల్ 'వీర్ దాస్: ఫూల్ వాల్యూమ్'. బెస్ట్ కామెడీ విభాగంలో ఈ కార్యక్రమం నామినేషన్ దక్కించుకుంది.

రీసెంట్ గా 'బత్తా' తో మరో హిట్ ని అందుకున్న సేతుపతి 'మహారాజా' సినిమాతో భాషా సరిహద్దులు దాటి ప్రేక్షకులకు చేరువయ్యారు. ఇప్పుడు అంతర్జాతీయ ఎమ్మీ వేదికపై ప్రజెంటర్‌గా పాల్గొనడం ఆయన కెరీర్లో మరో ప్రత్యేకమైన ఘట్టం. మొత్తానికి తన నటనతోనే కాదు.. ఇలాంటి అంతర్జాతీయ గుర్తింపులతోనూ విజయ్ సేతుపతి వార్తల్లో నిలుస్తున్నాడు.
మీకు నచ్చవచ్చు :పెద్ది పై శృతి హాసన్ అదిరిపోయే డైలాగ్స్!
మీకు నచ్చవచ్చు:నాగచైతన్య విషయంలో నాగార్జున ఆందోళన!
[Vijay Sethupathi, Emmy Awards,Makkal Selvan, Tollywood]



