TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

ఓటీటీలోకి వచ్చేస్తున్న నయనతార 'మహాశక్తి'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Nov 24, 2026 10:33AM


ఈ నెల 6 న సెల్యులాయిడ్ పై 'మహాశక్తి' తో అడుగుపెట్టింది లేడీ సూపర్ స్టార్ నయనతార. అభిమానులు, ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకోవడంతో పాటు రివ్యూస్ కూడా నార్మల్.. దీంతో ఓటిటి సినీ ప్రేమికుల రెస్పాన్స్ కోసం స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది. మరి లేటు చెయ్యకుండా ఆ లక్కీ డేట్ ఏంటో చూద్దాం. 

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో డిసెంబర్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది.  తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లోను అందుబాటులోకి ఉంచడం మహాశక్తి స్పెషాలిటీ.


2020లో విడుదలైన 'మూకుత్తి అమ్మన్' సినిమాకు కొనసాగింపుగా ఈ రెండో భాగాన్ని తెరకెక్కించారు. నయనతార శక్తి అనే పోలీస్ కానిస్టేబుల్ రోల్ ల్లో కనిపించనుంది. ఆమెకు తరచూ కొన్ని వింత కలలు వస్తుంటాయి. గుర్రాలు, కత్తులు, సైన్యాలు కనిపిస్తూ.. మైలాంజీ అనే ఊరికి వెళ్లమంటూ ఎవరో పిలుస్తున్నట్లు అనిపిస్తుంటుంది.

ఒక చిన్నారిని బలి ఇవ్వడానికి ప్రయత్నించిన దుండగులను శక్తి అడ్డుకోవడంతో కథలో కీలక మలుపు వస్తుంది. ఆ తర్వాత ఆమె మైలాంజీ గ్రామానికి వెళ్లడం, అక్కడ ఎదురయ్యే వింత సంఘటనలు కథను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి.

ఇది కూడా చదవండి: పెద్దిపై శృతి హాసన్ సంచలన వ్యాఖ్యలు!

ఇంకా కథ చెప్తే కిక్ ఉండదు. కాబట్టి థియేటర్ రెస్పాన్స్ ని పట్టించుకోకుండా ఓటిటి  ప్రేమికులు ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఎన్నో సినిమాలని ఓటిటిలో హిట్ చేసిన రికార్డు మీ సొంతం.మేకర్స్ కూడా ఆ నమ్మకంతోనే ఉన్నారు.     

సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం సమాధి చేసిన బైరా అనే దుష్టశక్తిగా రెజీనా పెర్ఫార్మ్ మరో ప్రధాన హైలెట్.పక్కా మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్. సీనియర్ డైరెక్టర్ సుందర్ దర్శకత్వం మిమ్మల్ని నిరుత్సాహపరచదు. మిగతా నటీనటుల పెర్ఫార్మెన్స్,  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సైతం ఒక కొత్త లోకాన్ని పరిచయం చేస్తుంది.

 

మీకు నచ్చవచ్చు:నీహారిక సంచలన నిర్ణయం!

మీకు నచ్చవచ్చు:వెట్రిమారన్ ప్లాన్ అదిరింది భయ్యా!

 

[Mahasakthi, Mookuthi Amman 2, Nayanthara, JioHotstar OTT, Tollywood]

 

 

google-ad-img