Home

»

Latest News

విజయ్-రష్మిక విడాకుల న్యూస్: ఎటుపోతోంది ఈ సమాజం.!

Oct 25, 2026 2:08PM

సెలబ్రిటీల పెళ్లి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి అభిమానుల్లో ఉండటం సహజం. కానీ, వారి వ్యక్తిగత జీవితాల గురించి తెలియని విషయాలను ఊహించుకుని.. ఏకంగా విడాకుల వరకు వెళ్లిపోవడం మాత్రం కాస్త అతిగానే అనిపిస్తుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న విషయంలోనూ ఇదే జరుగుతోంది. పెళ్లై కొన్ని నెలలు కూడా గడవకముందే ఈ జంట విడిపోతోందంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.

విజయ్, రష్మిక జంటకు టాలీవుడ్‌లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలతో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అప్పటినుంచి ఈ జంట ప్రేమలో ఉందంటూ వార్తలు వచ్చినా.. చాలాకాలం పాటు తమ వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్‌గానే ఉంచారు. చివరకు 2026 ఫిబ్రవరిలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అభిమానులు వీరి జంటను ‘విరోష్’ అని పిలుచుకుంటూ సందడి చేశారు.

అయితే, పెళ్లి తర్వాత కూడా ఈ జంటకు ట్రోలింగ్ తప్పడం లేదు. తాజాగా కరణ్ జోహార్ నిర్వహించే ‘కాఫీ విత్ కరణ్’ షోలో విజయ్, రష్మిక పాల్గొనడంతో కొత్త వివాదం మొదలైంది. పెళ్లి ప్రపోజల్ గురించి చర్చ వచ్చినప్పుడు.. రష్మిక తనను పెళ్లి చేసుకోమని చాలాసార్లు అడిగిందని విజయ్ సరదాగా చెప్పడం, ఏడాది పాటు పెళ్లి గురించి అడిగానని రష్మిక చెప్పడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

అక్కడితో ఆగకుండా కొందరు విజయ్‌ను ‘రెడ్ ఫ్లాగ్’ అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇద్దరి మధ్య ఎవరు ముందుగా పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారనే విషయాన్ని కూడా పెద్ద చర్చగా మార్చేశారు. సరదాగా సాగిన సంభాషణను పట్టుకుని.. వారి వ్యక్తిగత సంబంధంపై తీర్పులు ఇవ్వడం మొదలుపెట్టారు.

ఇక ఇప్పుడు మరో కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. విజయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో రష్మికను అన్ ఫాలో చేశాడని, ఇద్దరి మధ్య దూరం పెరిగిందంటూ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. అసలు నిజం ఏంటంటే.. విజయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరినీ ఫాలో అవ్వడం లేదు. కానీ, రష్మికను మాత్రమే ఫాలో అవ్వడంలేదని, ఆమెను కొత్తగా అన్ ఫాలో చేశాడన్నట్టుగా కథలు అల్లుతున్నారు. దీంతో ఇది కొందరు నిజం అనుకుంటున్నారు.

ఈ ప్రచారంపై విజయ్, రష్మిక అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇద్దరూ తమ జీవితాన్ని తమకు నచ్చినట్టుగా గడుపుతుంటే.. ప్రతి చిన్న విషయాన్ని వివాదంగా మార్చడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరిని ఫాలో అవుతున్నారు? ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారు? అనే అంశాల ఆధారంగా ఒక జంట బంధంపై నిర్ణయానికి రావడం సరికాదని అంటున్నారు.

సెలబ్రిటీల సినిమాల గురించి చర్చించడం, వారి విజయాలను ఆస్వాదించడం వరకు బాగానే ఉంటుంది. కానీ, వారి వ్యక్తిగత జీవితాలపై ఆధారాలు లేని ప్రచారాలు చేయడం ఎంతవరకు సమంజసం?. 

ఇది కూడా చదవండి: RC17 లాంచ్ డేట్, మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్.. ముగ్గురు హీరోయిన్లకు లుక్ టెస్ట్.!

 

 

 

[Vijay Rashmika Divorce Rumours, Virosh Divorce Rumours, Instagram, Vijay Deverakonda, Rashmika Mandanna, Koffee With Karan, Virosh, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com