Home

»

Latest News

RC17 బిగ్ అప్డేట్: లాంచ్ డేట్, మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్.. ముగ్గురు హీరోయిన్లకు లుక్ టెస్ట్.!

Oct 25, 2026 1:15PM

రామ్ చరణ్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘రంగస్థలం’ తర్వాత వీరిద్దరూ మరోసారి కలుస్తుండటంతో మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి వరుస అప్‌డేట్స్‌ వినిపిస్తున్నాయి.

రీసెంట్ గా '418' మూవీ మీడియా మీట్ లో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాత వై. రవిశంకర్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, నవంబర్‌ 1న RC17 పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీంతో చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌ అధికారికంగా ప్రారంభం కానుంది. ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ కానుంది.

ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుధ్‌ రవిచందర్‌ ఖరారైనట్లు సమాచారం. ఇప్పటివరకు సుకుమార్‌ సినిమాలకు ఎక్కువగా దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించగా, ఈసారి అనిరుధ్‌ పేరు తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది. అయితే దీనిపై మేకర్స్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరోవైపు హీరోయిన్ ఎంపిక కూడా చర్చనీయాంశంగా మారింది. సారా అర్జున్‌, అనీత్‌ పడ్డా, ప్రీతి ముకుందన్‌లకు సంబంధించి లుక్‌ టెస్టులు పూర్తయినట్లు ప్రచారం జరుగుతోంది. వీరిలో ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

RC17 కథ, నిడివిపై కూడా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించే అవకాశాలున్నాయని టాక్‌ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ధ్రువీకరణ లేదు.

‘రంగస్థలం’తో రామ్ చరణ్‌కు కెరీర్‌లో గుర్తుండిపోయే విజయాన్ని అందించిన సుకుమార్‌.. ఈసారి ఎలాంటి కథతో వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అనిరుధ్‌ సంగీతం, రెండు భాగాల ప్రచారం.. ఇలా ప్రతి అంశం సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. మరి నవంబర్‌ 1న జరిగే ప్రారంభోత్సవం సందర్భంగా చిత్రబృందం మరిన్ని వివరాలు వెల్లడిస్తుందేమో చూడాలి.

ఇది కూడా చదవండి: ఎవరీ వైకోమ్ విజయలక్ష్మి.. చూపు లేకపోయినా గాత్రంతో జాతీయ అవార్డు.!

 

 

 

[RC17 Movie Update, RC17 Movie Launch Date, RC17 Music Director, RC17 Heroine, Ram Charan, Sukumar, Anirudh, Sara Arjun, Aneet Padda, Preity Mukhundhan]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com