Home

»

Latest News

మళ్ళీ అదే మ్యాజిక్‌ జరిగితే విజయ్‌ దేవరకొండకు తిరుగులేదు!

Mar 30, 2024 11:33AM

ఒక సినిమాకి కథ, కథనం, ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌, డైరెక్టర్‌ టేకింగ్‌ అనేది చాలా ఇంపార్టెంట్‌. వీటన్నింటినీ మించి ఎంత తక్కువ టైమ్‌లో మనం చెప్పాలనుకున్నది చెబుతున్నామనేది కూడా ముఖ్యమే. ప్రస్తుతం తెలుగు సినిమాలకు సంబంధించి ఇలాంటి చర్చ బాగా జరుగుతోంది. ఒక సినిమా రిలీజ్‌ కాబోతోందీ అంటే దాని రన్‌ టైమ్‌ ఎంత అనేది చూస్తున్నారు. సినిమా ఎలా ఉంటుందో పక్కన పెడితే ముందు రన్‌ టైమ్‌ చూసి భయపడుతున్నారు. పాత రోజుల్లో 3 గంటలు థియేటర్‌లో కూర్చొని సినిమా చూస్తే తప్ప ప్రేక్షకులు శాటిస్‌ఫై అయ్యేవారు కాదు. కాలం గడుస్తున్న కొద్దీ రన్‌టైమ్‌ కూడా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం తెలుగు సినిమా ఏవరేజ్‌ రన్‌టైమ్‌ 2 గంటలు లేదా 2 గంటల 20 నిమిషాలు. అంతకంటే ఏమాత్రం ఎక్కువ ఉన్నా రన్‌ టైమ్‌ ఎక్కువ అనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. 

ఇప్పుడు విజయ్‌ దేవరకొండ, పరశురామ్‌ కాంబినేషన్‌లో దిల్‌రాజు నిర్మించిన ‘ఫ్యామిలీ స్టార్‌’ విషయంలోనూ ఇవే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఏప్రిల్‌ 5న ఈ సినిమా రిలీజ్‌ కాబోతోంది. ఈ సినిమా రన్‌ టైమ్‌ 2 గంటల 40 నిమిషాలు ఉందని తెలుస్తోంది. సెన్సార్‌ సర్టిఫికెట్‌తో అఫీషియల్‌గా ఎనౌన్స్‌ చేసినపుడే రన్‌టైమ్‌ని కన్‌ఫర్మ్‌గా చెప్పగలం. అయితే సినిమాలో విషయం ఉంటే రన్‌ టైమ్‌ సమస్యే కాదని ఈమధ్యకాలంలో వచ్చిన చాలా సినిమాలు ప్రూవ్‌ చేశాయి. విజయ్‌ దేవరకొండ, పరశురామ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘గీత గోవిందం’ రన్‌ టైమ్‌ 2 గంటల 28 నిమిషాలు. అయితే ఆ సినిమా కథ, కథనాలు ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి కాబట్టి రన్‌ టైమ్‌ని పట్టించుకోకుండా సినిమాను ఎంజాయ్‌ చేశారు. ఇప్పుడు అదే కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కాబట్టి ఇది కూడా అంతే గ్రిప్పింగ్‌గా ఉంటుందని అంతా భావిస్తున్నారు. ‘గీతగోవిందం’ చిత్రానికి జరిగిన మ్యాజిక్‌ ‘ఫ్యామిలీ స్టార్‌’కి కూడా జరిగితే విజయ్‌ దేవరకొండ మరో హిట్‌ కొట్టడం ఖాయమనిపిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈమధ్యకాలంలో పెద్ద సినిమాల రిలీజ్‌లు లేవు కాబట్టి ఇది విజయ్‌ దేవరకొండకు ప్లస్‌ అయ్యే అవకాశం ఉంది. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com