నితిన్ తమ్ముడు ఇలాగే రాబోతున్నాడు..ఎంతైనా పవన్ ఫ్యాన్ కదా
on Mar 30, 2024
2002 లో వచ్చిన జయం మూవీ ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరో నితిన్. మొదటి సినిమాతోనే 100 రోజుల హీరోగా రికార్డు సృష్టించాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. ఎంతో మంది అభిమానులని కూడా సంపాదించాడు. ఈ రోజు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన అభిమానులకి ఒక అదిరిపోయే గిఫ్ట్ ని ఇచ్చాడు.
నితిన్ నయా మూవీ తమ్ముడు. గత చిత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్ పరాజయంతో ఇప్పుడు అభిమానుల ఆశలన్నీ తమ్ముడు మీదనే ఉన్నాయి. ఇక ఈ మూవీ నుంచి తాజాగా టైటిల్ లోగో, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయ్యింది. ఒక సిటీ బస్సు మీద నితిన్ కూర్చుని ఉన్నాడు. ఫేస్ మొత్తం చాల సీరియస్ గా ఉంది. చేతిలో సుబ్రహ్మణ్యస్వామి ఆయుధమైన శూలం ఉంది.బస్సును ఒక మహిళ డ్రైవ్ చేస్తోంది ఆమె గెటప్ కూడా చాలా వెరైటీ గా ఉంది. లోపల సీనియర్ నటి లయ కూడా కనిపిస్తుంది. ఇక బస్సు పై పగడాలమ్మ తల్లి దీవెనలతో రాసి ఉంది. దీంతో అందరిలో ఆసక్తి ఏర్పడింది.
అగ్ర నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. నితిన్ కెరీర్లోనే ఒక మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోవాలనే పట్టుదలతో ఆయన ఉన్నాడు. ఇంతకు ముందు ఈ ఇద్దరి కాంబోలో దిల్, శ్రీనివాస కళ్యాణం సినిమాలు వచ్చాయి. నాని తో ఎంసీఏ, పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ చిత్రాలని తెరకెక్కించిన వేణు శ్రీరామ్ దర్శత్వంలో తెరకెక్కుతుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రాపర్‌గా వర్క్ చేస్తున్నాడు. కాంతార, విరూపాక్ష చిత్రాలకి మ్యూజిక్ ని అందించిన అజనీష్ లోక్‌నాథ్ తమ్ముడికి కూడా సంగీతాన్ని అందిస్తున్నాడు. ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నాడు.
Also Read