Home

»

Latest News

విజయ్ దేవరకొండని కాపాడిన అగ్ర హీరో: బయటపడ్డ సంచలన నిజాలు!

Oct 21, 2026 5:04PM



కొన్ని న్యూస్ అంతే సెకనులో పుట్టుకొచ్చి, వైరల్ హోదాలో నిలుస్తాయి. విక్టరీ వెంకటేష్, విజయ్ దేవరకొండ  కి సంబంధించిన న్యూస్ కూడా అంతే సినీ సర్కిల్స్ లో విత్ ఇన్ సెకన్ లో పుట్టుకొచ్చి వైరల్ హోదాలో నిలిచింది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం.

విజయ్ దేవరకొండ  ‘రణబాలి’ తో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. తొలి షో నుంచే  డిజాస్టర్  టాక్ ని తెచ్చుకుంది. దీంతో ఇక  విజయ్ దేవరకొండ పైకి లేవడం కష్టమేనేమో అని అంతా అనుకున్నారు. కానీ  ఇప్పుడు బ్రేక్ ఈవెన్ మార్కుకి చాలా దగ్గరగా రాబోతుంది. అందుకు ముఖ్య కారణం దసరా సీజన్ ఒకటి అయితే , వెంకటేష్ మరో కారణమనే మాటలు ట్రేడ్ సర్కిల్స్ లో వినపడుతున్నాయి. ఎందుకంటే అక్టోబర్ 9 న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రాన్ని విడుదల చేద్దామని అనుకున్నారు. ఆ డేట్ మిస్ అయితే అక్టోబర్ 16 న విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడంతో అక్టోబర్ 30 కి  షిఫ్ట్ అయ్యింది. 


ఇది కూడా చదవండి: 'రామాయణ' అడ్వాన్స్ బుకింగ్స్ ఎంతంటే? షాక్ లో ఫ్యాన్స్!

 

 

ఒకవేళ చెప్పిన తేదికి మూవీ వచ్చి ఉండుంటే కచ్చితంగా ‘రణబాలి’ డిజాస్టర్ ఫ్లాప్ అయ్యేది. ఎందుకంటే ఆడియన్స్ కి ఇప్పటికే మొదటి ఛాయస్ గా ‘జైలర్ 2’ చిత్రం ఉంది. ఒకవేళ ‘ఆదర్శ కుటుంబం’కి సూపర్ హిట్ టాక్ వస్తే , ఆడియన్స్ దానికి కూడా సమానమైన ప్రాధాన్యత ఇస్తారు.డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కూడా రెండవ ఛాయస్ గా ఆ సినిమాని ఉంచుకుంటారు. కానీ ‘రణబాలి’ ని ఎవరు పట్టించుకోరు . అందుకే ‘ఆదర్శ కుటుంబం’  వాయిదా పడడం వల్ల , విక్టరీ వెంకటేష్ పరోక్షంగా విజయ్ దేవరకొండ కెరీర్ ని రక్షించాడు అని  విశ్లేషకులు చెప్తున్నారు. 'రణబాలి’ వసూళ్లని చూసుకున్న మొదటిరోజు వరల్డ్ వైడ్ గా 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లని రాబట్టి మొత్తం ఐదు రోజులకి వరల్డ్ వైడ్ గా 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. 42 కోట్లకి బయ్యర్లు  కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. అంటే పూర్తి రన్ లో సేఫ్ జోన్ లోకి వస్తుందేమో! 


   

[Victory Venkatesh Helped Vijay Devarakonda, RanaBaali Collections, Vijay Deverakonda About Ranabaali, Venkatesh, Adarsha Kutumbam, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com