యువతకి విక్టరీ పిలుపు: వాళ్ళ జీవితానికీ ఎస్ చెప్పండి!
Nov 25, 2026 1:25PM
.webp)
విక్టరీ వెంకటేష్ అనే పేరుకి ఉన్న హిస్టరీ గురించి చెప్పుకోవడం స్టార్ట్ చేస్తే రోజులు చాలవు. మిస్టర్ క్లీన్ ఇమేజ్, వివాదరహితుడు అనే టాగ్ లైన్స్ ఆభరణాల్లా, వైఫే లా చుట్టుముట్టి ఉంటాయి.
వెంకటేష్ యువతకు కీలక సందేశం ఇచ్చారు. కొంత మంది యువత డ్రగ్స్‌కి బానిసలై తమ చదువు, ఆరోగ్యం, భవిష్యత్తును కోల్పోతున్నారని, దయచేసి మీరు వాటికి బానిసయ్యి జీవితాలని నాశనం చేసుకోవద్దని, మంచి భవిష్యత్తు కోసం వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. యువతని మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడుకోవడం తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. పిల్లలతో తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా మాట్లాడాలని, వారి సమస్యలను అర్థం చేసుకుని అండగా నిలవాలని సూచించారు.

2029 నాటికి డ్రగ్స్ రహిత భారతదేశాన్ని నిర్మించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వెంకటేష్ పిలుపునిచ్చారు. వ్యసనాల నుంచి బయటపడాలనుకునే వారు సహాయం తీసుకోవడానికి 14446 డీ-అడిక్షన్ హెల్ప్‌లైన్‌ను కూడా ఉపయోగించుకోవచ్చని సూచించారు.
ఇది కూడా చదవండి: భోగి ప్రమోషన్స్‌కి అనుపమ దూరం:డింపుల్ హయాతికి పెరిగిన ప్రాధాన్యత..కారణం ఇదేనా!

చివరిగా ‘నో టు డ్రగ్స్.. యెస్ టు లైఫ్’ అంటూ యువతకి సందేశమిచ్చారు. వెంకటేష్ ఇచ్చిన ఈ పిలుపు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘నషా ముక్త్ భారత్’ పాదయాత్రలో పాల్గొన్న వెంకటేష్ పైన చెప్పుకున్న విధంగా మాట్లాడటం జరిగింది.
మీకు నచ్చవచ్చు
చిన్నారి ఇన్ స్టా రీల్‌కి మహేష్ బాబు ఫిదా!
Venkatesh, Say No To Drugs, Yes Life, Kishan Reddy]




