TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

భోగి ప్రమోషన్స్‌కి అనుపమ దూరం:డింపుల్ హయాతికి పెరిగిన ప్రాధాన్యత..కారణం ఇదేనా!

Nov 25, 2026 11:55AM

అనుపమ పరమేశ్వరన్. షార్ట్ పీరియడ్ లోనే భారీగా అభిమానులని సంపాదించుకుంది. పాన్ ఇండియా వ్యాప్తంగా అని చెప్పుకున్నా పెద్ద తప్పేమి కాదు. ఎందుకంటే తన సినీ లిస్ట్ అలాగే ఉంది మరి.. ఈ నెల 27 న శర్వానంద్ తో కలిసి 'భోగి' తో థియేటర్స్ లో తిష్ట వేయడానికి వస్తుంది. మెయిన్ హీరోయిన్ కూడా. ఈ విషయం 'భోగి' నుంచి రిలీజ్ చేసిన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ నే చెప్తుంది. 

అయితే ప్రమోషన్స్‌లో అనుపమ పరమేశ్వరన్ కనిపించకపోవడం ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు భోగిలో సెకండ్ హీరోయిన్  అనే టాగ్ లైన్ తో రన్ అవుతూ వస్తున్న డింపుల్ హయాతి ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటుండటంతో అసలు సినిమాలో ఏం జరుగుతోందనే ఆసక్తి మొదలైంది.


 సినీ సర్కిల్స్ లో పౌడర్ కొట్టుకొని మరి తాజా న్యూస్ హోదాలో 'డింపుల్ హయాతిని సహాయ రోల్  కోసమే తీసుకున్నారని, ఆ తర్వాత కథలో మార్పులు చేయడంతో ఆమెకి ఎక్కువ ప్రాధాన్యత వచ్చిందని ప్రచారం జరుగుతోంది. అనుపమకు మొదట చెప్పిన కథకు, ప్రస్తుతం తెరకెక్కిన కథకు మధ్య మార్పులు జరిగాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్, మ్యూజికల్ ఈవెంట్‌లకి  అనుపమ హాజరుకాలేదు. అంతేకాదు.. సినిమా టీజర్, ట్రైలర్, పాటలను కూడా తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేయకపోవడం అభిమానుల్లో అనుమానాలు పెంచుతోంది. మరోవైపు డింపుల్ హయాతి మాత్రం శర్వానంద్‌తో కలిసి ప్రమోషన్లలో సందడి చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: నయనతార మరి ఇలా అయిపోయిందేంటి? ఫ్యాన్స్ షాక్!  

అయితే అనుపమ ప్రమోషన్లకి దూరంగా ఉండటానికి అసలు కారణం ఏమిటనేది ఇప్పటివరకు చిత్రబృందం అధికారికంగా వెల్లడించలేదు. కథలో మార్పులు, హీరోయిన్ల  ప్రాధాన్యతపై వస్తున్న వార్తలు కూడా ఇంకా ప్రచార స్థాయిలోనే ఉన్నాయి.

మరి విడుదలకి ముందైనా అనుపమ ప్రమోషన్లలో పాల్గొంటుందా?  చిత్రబృందం స్పందిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇదంతా ఏదో మాట వరసకి అనుకుంటున్నాం గాని రిలీజ్ ఎల్లుండే కదా? నో స్పందన అని మరో వర్గం సినీ సర్కిల్స్ లో అంతే పౌడర్ కొట్టుకొని ప్రచారం చేస్తూ ఉంది. సంపత్ నంది దర్శకుడు. రాధామోహన్ నిర్మాత. 

 

మీకు నచ్చవచ్చు:చిన్నారి ఇన్‌ స్టా రీల్‌కి మహేష్ బాబు ఫిదా!

                                    భోగి ఫస్ట్ రివ్యూ!

 

[Anupama Parameswaran, Sharwanandh, Bhogi, Dimple hayathi, Sampath Nandi]

google-ad-img