Home

»

Latest News

Ustaad bhagat singh vs dhurandhar 2: అర్ధరాత్రి నుంచే వార్ స్టార్ట్   

Mar 07, 2026

 

-ధురంధర్ పార్ట్ 2 ట్రైలర్ వచ్చేసింది 
-ఉస్తాద్ పరిస్థితి ఏంటి!
-18 అర్ధరాత్రి నుంచే వార్ ఖాయమా!

 

భారతీయ సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'ధురంధర్ పార్ట్ 2(Dhurandhar 2).ఈ నెల 19 న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. పార్ట్ 1 లో 'రెహ్మాన్ డెకాయత్' ని మన దేశపు 'రా' ఏజెంట్ హోదాలో హంజా అలీ మజారి అలియాస్ 'జస్కి రత్ సింగ్ రంగి' చంపడంతో పార్ట్ 2 పై ఎవరికి ఇష్టమొచ్చిన రీతిలో వాళ్ళు కథని అల్లుకుంటు కోటి ఆశలతో ఎదురుచూస్తూ వస్తున్నారు. వాళ్ళ ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెడుతు   అంచనాలని పెంచుకునేలా ఈ రోజు ధురంధర్ 2 ట్రైలర్ వచ్చేసింది. రావడమే కాదు తెలుగు ప్రేక్షకుల్లో సరికొత్త అనుమానాలకి, చర్చలకి తావు ఇచ్చింది. విషయమేంటో చూద్దాం.

సుమారు మూడు నిమిషాల పద్దెనిమిది సెకన్ల నిడివి ఉన్న ట్రైలర్ ఒక రేంజ్ లో ఉంది. ఐదు గంటల్లోనే వచ్చిన  9 . 5 మిలియన్స్ వ్యూస్ రేంజ్ స్థాయికి ప్రత్యక్ష ఉదాహరణ. తెలుగులో కూడా ధురంధర్ 2 విడుదలవుతున్న విషయం తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో ధురంధర్ 2 vs ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh)అనే డైలాగ్ ఫుల్ స్వింగ్ మోడ్ లో వెళ్తుంది. నిజానికి   ఉస్తాద్ భగత్ సింగ్ డేట్ 26 నుంచి 19 కి మారినప్పుడు పెద్దగా చర్చ జరగలేదు. కానీ ఇప్పుడు  ధురంధర్ ట్రైలర్ రిలీజైన దగ్గర్నుంచి ఉస్తాద్ vs ధురంధర్ వర్డ్  బాగానే రన్ అవుతుంది. కొంత మంది ధురంధర్ 2  ప్రభావం తెలుగులో పెద్దగా ఏముంటుందిలే అని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. కానీ అలా అనుకోవడం పొరపాటే అవుతుంది. 


also read: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి.. వధువు కావ్య రెడ్డి ఎవరో తెలుసా!

ధురంధర్ మొదటి భాగం తెలుగు లాంగ్వేజ్ లో రిలీజ్ అవ్వకపోయినా హిందీ వెర్షన్ ని మెజారిటీ తెలుగు ప్రేక్షకులందరు చూసారు. భారీ స్థాయి కలెక్షన్స్ కూడా రావడంతో పాటు ధురంధర్ సబ్జెట్  గురించి చర్చలు కూడా జరిగాయి. మరి ఈ లెక్కన ధురంధర్ 2  తెలుగులో కూడా మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. 18 నుంచే ప్రీమియర్ షోస్ ఉన్నాయని కూడా అనౌన్స్ చెయ్యడంతో ఉస్తాద్ vs  ధురంధర్ 2 మధ్య పోటీ ఖాయమని సినీ ఎక్స్ పర్ట్స్ చెప్తున్నారు. పైగా పోటీ అనేది అభిమానులు, మూవీ లవర్స్, ప్రేక్షకులు సినిమాకి కల్పించిన హక్కు . ఉస్తాద్ హంగామ కూడా ప్రీమియర్స్ తో షురు కానున్న విషయం తెలిసిందే. ఇక ధురంధర్ తెలుగు ట్రైలర్ ఈ సాయంత్రానికి ప్రత్యక్షమవ్వడం ఖాయం.

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com