Home

»

Latest News

Ustaad Bhagat singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి షాకింగ్ బిజినెస్.. ఇక ట్రైలర్ ఎప్పుడో చెప్పండి 

Mar 02, 2026


 

-ఉస్తాద్ బిజినెస్ పై సినీ విశ్లేషకులు ఏమంటున్నారు 
-అదే జరిగితే పవన్ ని ఆపడం కష్టమేనా!
-లెక్కలు ఏం చెప్తున్నాయి 
-ట్రైలర్ కోసం వెయిటింగ్ 


బేసిక్ గా ఒక్కో హీరో అభిమానికి ఒక్కో టైం వస్తుంది. ఆ టైం ఏర్పడటానికి కారణం తమ అభిమాన హీరో మూవీ రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ కావడమే. ఆ టైంలో ఇంట్లో శుభకార్యం జరుగుతున్నంత  ఊపిరి సలపని బిజీతో ఉంటారు. ఆ శుభ గడియలు ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)అప్ కమింగ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)రూపంలో ఫ్యాన్స్ ని ఆవహించాయి. పైగా 'గబ్బర్ సింగ్' కాంబో కావడంతో వాళ్ళ అంచనాలకి కొత్తగా రెక్కలు వచ్చి ఏ రికార్డు దగ్గర ఆగాలో వాళ్ళకే తెలియని పరిస్థితి. కేవలం సినిమాగానే కాకుండా, అభిమానుల ఎమోషన్స్ ని ప్రతిబింబించేలా కూడా రూపుదిద్దుకుంటోంది. ఈ నేపథ్యంలో ఉస్తాద్  బిజినెస్ రేంజ్ ఏంటి? బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి వసూళ్లు రాబడితే సేఫ్ అనే చర్చలు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నాయి. ఆ విశేషాలని చూసేద్దాం.

థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 130 కోట్ల రూపాయిల వరకు బిజినెస్ జరిగి ఉండవచ్చనే  అంచనా వేస్తున్నారు. ఓటిటి డీల్ కూడా 80 కోట్ల రూపాయలకి క్లోజ్ అయినట్లుగా సమాచారం. దీంతో ఫిల్మ్ సర్కిల్స్ లో 'ఉస్తాద్ భగత్ సింగ్' టాక్ ఆఫ్ ది లేటెస్ట్ న్యూస్ గా ఒక రేంజ్ లోనే వైరల్ గా మారింది. అయితే ఓవర్సీస్ మరియు ఇతర ఏరియాలని కలుపుకుంటే, బాక్స్ ఆఫీస్ వద్ద ఉస్తాద్ సుమారు 250 నుండి 350 కోట్ల రూపాయలు రాబడితే ఉస్తాద్ సేఫ్ జోన్ లోకి వెళ్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

వాళ్ళు ఇంకా మాట్లాడుతు ఉస్తాద్ లో పవన్ కళ్యాణ్ స్క్రీన్ స్పేస్ చాలా ఎక్కువగా ఉంటుందని, దాదాపు రెండు గంటల పాటు పవన్ ని వెండితెరపై చూడవచ్చు. ఓజి' కి  వచ్చిన రెస్పాన్స్ తో పవన్ కళ్యాణ్ లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అదే ఎనర్జీతో 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రమోషన్స్ లో  పాల్గొనే అవకాశం ఉంది. హరీష్ శంకర్(Harish Shankar)కి  ఉస్తాద్  భారీ విజయం సాధించడం అత్యంత కీలకం. కాబట్టి  గబ్బర్ సింగ్ బెంచ్ మార్క్ ని అందుకోవాలని  తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీంతో పవన్ మానియా కూడా వర్క్ అవుట్ అయితే  250 కోట్లు రాబట్టడం పెద్ద పనేమీ కాదని విశ్లేషకుల అభిప్రాయం. ఈ న్యూస్  అభిమానులకి  పూనకాలు తెప్పించే వార్తే.
 
మూవీలో పొలిటికల్ అంశాల గురించి చర్చ జరుగుతున్నప్పటికీ, ఇది ప్యూర్లీ సినిమా కేవలం జనాన్ని కనెక్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ నిజ జీవిత అంశాలని పాటల్లో మరియు నెరేటివ్ లో వాడారని సమాచారం. ఇప్పటికే హరీష్ శంకర్ కూడా ఈ విషయాన్నీ తెలియచేసాడు. మొత్తానికి 'ఉస్తాద్ భగత్ సింగ్' పవర్ స్టార్ స్టామినాని మరోసారి సినీ  ప్రపంచానికి చాటిచెప్పడానికి సిద్ధమవుతోంది. ట్రైలర్ రిలీజ్ అయితే సినిమా రేంజ్ ఏంటో మరింత స్పష్టత వస్తుంది.  ఈ నెల  26 న ఉస్తాద్ వరల్డ్ వైడ్ గా అడుగుపెడుతున్న విషయం తెలిసిందే

also read:  ANR..ఏఎన్నార్ టైటిల్స్‌ వాడితే పరిస్థితి ఇదే.. కానీ ఆ ఒక్క హీరో మాత్రం 

 ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు  మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం మా తెలుగు వన్ సినిమా ఛానల్‌ని ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి! కింద ఉన్న వీడియోతో పాటు  మా ఛానల్‌లో పవన్ కళ్యాణ్ సినిమాలపై మరిన్ని ప్రత్యేక వీడియోలు ఉన్నాయి. చూసి ఎంజాయ్ చేయండి.

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com