
సినిమాకి ఉన్న శక్తీ ఏ పాటిదో హీరోలు తెలియచేస్తూ రాజకీయరంగంలో తమ హవా చాటుతూ ఉండటం అనేది దశాబ్దాల తరబడి ప్రేక్షకులు, ప్రజలు చూస్తూనే ఉన్నారు. కానీ హీరోయిన్ కట్ అవుట్ కి కూడా హీరో కట్ అవుట్ కి ఉన్న శక్తీ ఉంటుందని నిరూపించే భామలు చాలా అరుదు. అలాంటి అరుదైన సమ్మోహన రూపం త్రిష.
త్రిష నిన్న తమిళనాడులోని కోయంబత్తూర్లో జరిగిన ప్రముఖ మొబైల్ షోరూమ్ ప్రారంభోత్సవానికి హాజరయ్యింది. ఈ క్రమంలో ఆమె రాక గురించి తెలుసుకున్నఅభిమానులు,స్థానిక ప్రజలు త్రిషని కళ్లారా చూసేందుకు, సెల్ఫీలు దిగేందుకు కోయంబత్తూరు విమానాశ్రయానికి భారీ సంఖ్యలో పరుగులు తీశారు. ఎయిర్పోర్టు నుంచి ఆమె కారులో బయలుదేరినప్పటి నుంచి రోడ్డు పొడుగునా అభిమానులు బారులు తీరి ఘన స్వాగతం పలికారు. కేవలం ఒక షాప్ ఓపెనింగ్ ఈవెంట్ అయినప్పటికీ, ఆమె చుట్టూ ఏర్పడిన జనసందోహం చూస్తుంటే తమిళ సీమలో త్రిషకి ఏ స్థాయిలో ఆదరణ ఉందో అర్ధం చేసుకోవచ్చు ఈ జనబాహుళ్యం మధ్య రాకపోవడానికి కొంతమేర అంతరాయం ఏర్పడినప్పటికీ, అభిమానుల ప్రేమ ముందు అవేవీ పెద్దగా అనిపించలేదు.
ఇది కూడా చదవండి: 'స్వయంభు' పై నిఖిల్ ఎమోషనల్ పోస్ట్: ఫ్యాన్స్ భావోద్వేగం!
.webp)
అయితే, ఈ పర్యటనలో భాగంగా విమానాశ్రయం బయటికి వస్తున్న సమయంలో మీడియా ప్రతినిధులు త్రిషతో 'మీరు త్వరలో రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారా?" అంటూ ప్రశ్నించారు. త్రిష ఎలాంటి సమాధానం ఇవ్వకుండా అందమైన చిరునవ్వువిసిరి అక్కడి నుంచి వేగంగా ముందుకు సాగిపోయారు. ఆమె ఇచ్చిన ఆ చిరునవ్వు వెనుక అసలు అర్థమేంటి? త్రిష త్వరలోనే ప్రత్యక్ష రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నారనే ప్రచారానికి ఇది సంకేతమా? లేక కేవలం మీడియా ప్రశ్నను సున్నితంగా దాటవేసే ప్రయత్నమా? అనే కోణంలో ఇప్పుడు కోలీవుడ్ రాజకీయ వర్గాల్లో రకరకాల విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి.
[Trisha Reacts Her Political Entry latest, Trisha About Her Political entry, Trisha Coimbatore airport, Trisha latest news, Kollywood updates, Trisha reaction to politics, South Indian actress news, Telugu Cinema, Tollywood, Telugu News, Tollywood News]






