Home

»

Latest News

సూర్యకు హ్యాట్రిక్ ఛాన్స్: ‘సీన్’తో హిస్టరీ క్రియేట్ చేస్తారా.?

Oct 26, 2026 1:20PM

ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకెళ్లిన కోలీవుడ్ స్టార్ సూర్య.. మధ్యలో వరుస పరాజయాలతో కాస్త వెనుకబడ్డారు. దీంతో ఆయన అభిమానులు ఓ బలమైన కమ్‌బ్యాక్ కోసం ఎదురుచూశారు. అలాంటి సమయంలో ఈ ఏడాది సూర్యకు వరుసగా రెండు విజయాలు దక్కాయి. ఇప్పుడు మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆ సినిమానే ‘సీన్’ (Scene). ఈ చిత్రం కూడా హిట్ అయితే.. ఒకే ఏడాదిలో మూడు విజయాలు అందుకున్న అరుదైన రికార్డు సూర్య ఖాతాలో చేరుతుంది.

ఈ ఏడాది ఆర్జే బాలాజీ దర్శకత్వంలో నటించిన ‘కరుప్పు’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నారు సూర్య. మాస్ యాక్షన్ అంశాలతో పాటు డివోషనల్ టచ్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. చాలా కాలంగా సూర్య నుంచి ఓ భారీ కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ మూవీ మంచి కిక్ ఇచ్చింది.

ఆ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్న సమయంలోనే సూర్య మరో కొత్త జానర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో తన నటనతో మెప్పించారు. మాస్ పాత్రలో కనిపించిన వెంటనే.. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కథలో నటించడం ఆయనలోని వైవిధ్యాన్ని మరోసారి చాటిచెప్పింది.

ఇలా ఒకే ఏడాదిలో రెండు విభిన్నమైన కథలతో విజయాలు అందుకున్న సూర్య.. ఇప్పుడు మూడో సినిమాతో హ్యాట్రిక్‌పై కన్నేశారు.

మలయాళంలో ‘రోమాంచమ్’, ‘ఆవేశం’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు జీతు మాధవన్.. ఇప్పుడు సూర్యతో ‘సీన్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో సూర్య ఓ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. అయితే ఇది రెగ్యులర్ పోలీస్ కథలా కాకుండా.. క్రైమ్, కామెడీ, సస్పెన్స్ అంశాల మేళవింపుతో రూపొందుతున్నట్లు ప్రచార చిత్రాలు సూచిస్తున్నాయి. సూర్య పాత్రలోని ప్రత్యేకత ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

ఒకే ఏడాదిలో మూడు సినిమాలు విడుదల కావడం స్టార్ నటుల విషయంలోనే అరుదు. అలాంటిది మూడు విభిన్నమైన జానర్లలో నటించి, మూడు సినిమాలతోనూ విజయాలు అందుకుంటే అది సూర్య కెరీర్‌లో ప్రత్యేకమైన ఘనతగా నిలుస్తుంది.

‘సీన్’ నవంబర్ 6, 2026న దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది. మరి ఈ సినిమాతో సూర్య హ్యాట్రిక్ పూర్తి చేస్తారా? ఒకే ఏడాదిలో మూడు విజయాలతో బాక్సాఫీస్ వద్ద తనదైన రికార్డు సృష్టిస్తారా? అన్నది తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.

ఇది కూడా చదవండి: 17 ఏళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి.. టాలెంటెడ్ డైరెక్టర్‌తో కంగనా రనౌత్ క్రేజీ మూవీ.!

 

 

 

[Suriya Eyes Hat Trick with Scene, Suriya Scene Movie, Karuppu Movie, Vishwanath and Sons Movie, Scene Release Date, Jithu Madhavan, Nazriya Nazim, Naslen, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com