TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

నయనతార మరి ఇలా అయిపోయిందేంటి? ఫ్యాన్స్ షాక్!  

Nov 25, 2026 11:23AM


'మరి స్పీడ్ అయిపోమాకు స్టోరీ మారిపోద్ది' అని మెగాస్టార్ చిరంజీవి ముఠా మేస్త్రి సినిమాలో  ఊర మాస్ లెవల్లో చెప్పినా కూడా ప్రస్తుత సోషల్ మీడియా యూత్ ఏది నిజమో, ఏది అబద్దమో తెలుసుకోకుండానే నయనతార లేటెస్ట్ వీడియో అని షేర్ చేస్తున్నారు. మనం మాత్రం వాస్తవం ఎంతో తెలుసుకుందాం.

అయితే ఈసారి ఆమె కొత్త సినిమా అప్‌డేట్ వల్ల కాకుండా, అచ్చం ఆమెను పోలిన మరో మహిళ వీడియోలు నెట్టింట విపరీతంగా వైరల్ కావడమే ఇందుకు కారణం. తొలి చూపులో సాక్షాత్తూ నయనతారేనా అని భ్రమపడేంతగా ఆ పోలికలు ఉండటంతో అభిమానులు, ఒరిజినల్ నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.

ఇటీవల ఓ షాపింగ్ మాల్‌లో చిన్న పిల్లలు ఆడుకుంటున్న దృశ్యాలను చిరునవ్వుతో ఆస్వాదిస్తూ నిలబడి ఉన్న ఓ మహిళ వీడియో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వేదికల్లో తెగ చక్కర్లు కొడుతోంది. వీడియోలోని ఆమె కళ్లు, ముక్కు, చిరునవ్వు, జుట్టు ముడివేసుకున్న తీరు అచ్చం నయనతారనే తలపిస్తున్నాయి. దీంతో ఇది నయనతార పాత వీడియో అని పొరబడిన అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు, షేర్లు చేయడం మొదలుపెట్టారు.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఉన్నది నయనతార కాదు; ఆమె పేరు దీప్తి కళ్యాణి. కేరళకు చెందిన ప్రముఖ ట్రాన్స్‌జెండర్ మోడల్, మేకప్ ఆర్టిస్ట్ మరియు నటి. తన ప్రతిభతో మలయాళ ఇండస్ట్రీతో పాటు ఫ్యాషన్ రంగంలోనూ ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇది కూడా చదవండి: ఆదర్శ కుటుంబం ఓటిటి డేట్ వచ్చేసిందోచ్.. ఆ..ప్రియుల్లో కోలాహలం! 

అయితే తాజా మాల్ వీడియో వైరల్ కావడంతో ఆమె పేరు ఒక్కసారిగా దక్షిణాది సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం నెటిజన్లు ఆమెను ‘జూనియర్ నయనతార’, ‘నయనతార ట్విన్’ అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ప్రశంసలు ఎలాంటి తప్పు కాదులే.

 

మీకు నచ్చవచ్చు

జరిగేది ఇదే: ఒకేసారి సాంగ్స్ రిలీజ్ చేస్తే!

భోగి సెన్సార్ రివ్యూ!

 

[Transgender Deepthi Kalyani, Nayanthara, Kollywood, Mollywood]

google-ad-img