TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

ఆదర్శ కుటుంబం ఓటిటి డేట్ వచ్చేసిందోచ్.. ఆ..ప్రియుల్లో కోలాహలం! 

Nov 25, 2026 10:56AM

'ఎన్నాళ్లకెన్నాళ్లకెన్నాళ్లకు వెన్నెల్లు విరిశాయి మా కంటిలో' అని ఇప్పుడు ఓటిటి సినీ ప్రియులంతా ఆదర్శ కుటుంబంతో సింగర్స్ గా మారే పరిస్థితి. మరి 'ఆదర్శ కుటుంబం' ఓటిటి డేట్ వస్తే ఆ మాత్రం చెయ్యరా! మరి ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. 

విక్టరీ వెంకటేశ్,  త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో  తెరకెక్కిన ఆదర్శ కుటుంబం అక్టోబర్ 30 న థియేటర్స్ లోకి వచ్చింది.ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు నవంబర్ 27 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా సర్వం సిద్ధం చేసుకుంటుంది.

తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సంబంధించిన ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. తెలుగు ప్రేక్షకులతో పాటు ఇతర భాషల వారిని కూడా ఆకట్టుకునేలా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
కథ చెప్పడం స్టార్ట్ చేస్తే మీరు తిట్టుకుంటారని తెలుసు. అందుకే కథ చెప్పడం లేదు. మరి ఈ నెల 27 న ఎంజాయ్ యువర్ సెల్ఫ్. 

ఇది కూడా చదవండి: ఒకేసారి సాంగ్స్ రిలీజ్ చేస్తే: మీ సొమ్ము ఏమైనా పోతుందా..అభిమానుల సూటి ప్రశ్న!

వెంకటేశ్‌కు జోడీగా కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి జత కట్టగా .నారా రోహిత్, నివేదా పేతురాజ్, డింపుల్ హయాతి, యువీనా పార్వతి, రావు రమేశ్, వెన్నెల కిషోర్, సత్య, బ్రహ్మాజీ తదితరులు కీ రోల్స్. ఓటిటిలో చూసే భాగ్యాన్ని అందిస్తున్న వాళ్ళు  హారిక అండ్ హాసిని క్రియేషన్స్ రాధాకృష్ణ (చినబాబు) .తమన్ మ్యూజిక్.

మీకు నచ్చవచ్చు

చిన్నారి ఇనిస్టా రీల్: మహేష్ బాబు ఏం చేసాడో తెలిస్తే షాక్ అవుతారు!

భోగి ఫస్ట్ రివ్యూ!

 

[Aadarsha Kutumbam, Venkatesh, Trivikram, Srinidhi shetty, Netflix]

 

google-ad-img