ENGLISH | TELUGU  

Toxic: టాక్సిక్ తెలుగు బిజినెస్ పరిస్థితి ఇదే.. దిల్ రాజు కట్టిన అమౌంట్ వైరల్ 

on Feb 7, 2026

 


-టాక్సిక్ కి తెలుగు నాట అంత ఉందా!
-ఫ్యాన్స్ ఏమంటున్నారు
-రికార్డు స్థాయిలో బిజినెస్ 

 

పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద యష్(Yash)సృష్టించుకున్న సామ్రాజ్యానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. పైగా కేవలం కేజిఎఫ్(Kgf)సిరీస్ తోనే ఆ సామ్రాజాన్ని సృషించుకున్నాడంటే యష్ ఎంతగా అభిమానులు, ప్రేక్షకుల గుండెల్లో కొలువు తీరి ఉన్నాడో అర్ధమవుతుంది. అందుకే వచ్చే నెల 19 న విడుదల  కాబోతున్న 'టాక్సిక్'(Toxic)కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇందుకు తెలుగు ప్రేక్షకులు మినహాయింపు కాదు. అందుకే భారీ రేట్ కి అగ్ర నిర్మాత దిల్ రాజు తెలుగు రాష్ట్రాల హక్కులని పొందాడు. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌కి సంబంధించిన రిలీజ్ హక్కుల కోసం మూడు అగ్ర సంస్థ‌లు పోటీ పడ్డాయి. చివరికి దిల్ రాజు దక్కించుకున్నాడు.120 కోట్ల రూపాయిల భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఇప్పుడు ఈ విషయం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారడంతో పాటు టాక్సిక్ పై ఉన్న అంచనాలని రెట్టింపు చేస్తున్నాయి. హక్కులని దక్కించుకున్న తర్వాత దిల్ రాజు మాట్లాడుతు 'ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలోని పెద్ద స్టార్స్‌లో య‌శ్ ఒక‌రు. కెజియ‌ఫ్ 2 త‌ర్వాత ఆయ‌న మార్కెట్ మ‌రింత‌గా పెరిగింది. 'టాక్సిక్' కోసం ఆడియెన్స్ ఎంతో ఆస‌క్తిగా వెయిట్ చేస్తున్నారు. నాలుగేళ్ల త‌ర్వాత యష్ నుంచి వస్తుడటంతో అంచ‌నాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇలాంటి ప్రెస్టీజియ‌స్ మూవీని మా ఎస్‌వీసీ బ్యాన‌ర్‌పై తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానుండ‌టం చాలా ఆనందంగా ఉంది. య‌శ్‌తో ఇలాగే మ‌రిన్ని సినిమాలు చేయాల‌ని ఆశిస్తున్నాం అని చెప్పారు.


Also read:  sumathi sathakam: సుమతి శతకం రివ్యూ.. హిట్టా,ఫట్టా!


పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ కి సిద్దమవుతున్న టాక్సిక్ కి మహిళా దర్శకురాలు గీతూ మోహన్ దాస్(Geethu MOhandas)తెరకెక్కించింది. ఇటీవల టీజర్ రిలీజ్ చెయ్యగా అసభ్యత శృతి మించిందనే  విమర్శలు వస్తున్నాయి. టాక్సిక్ ని ఇంగ్లిష్, కన్నడ లాంగ్వేజ్ లో ఒకేసారి పిక్చరైజ్ చేసిన విషయం తెలిసిందే. నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, తార సుతారియా తదితరులు ముఖ్యమైన క్యారెక్టర్స్ లో కనిపిస్తున్నారు.రవి బస్రుర్ మ్యూజిక్.

 

   
 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.