Home

»

Latest News

కిడ్నాప్ కేసులో మంచు విష్ణుకు నోటీసులు.. అరెస్ట్ తప్పదా?

Feb 08, 2026

 

మంచు విష్ణు (Manchu Vishnu) చిక్కుల్లో పడ్డారు. విద్యార్థి సంఘం నేతల కిడ్నాప్ కేసులో ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో మంచు విష్ణు అరెస్ట్ తప్పదా? అనే చర్చ జరుగుతోంది.

 

తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ(Mohan Babu University)లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘం నేతలు అక్బర్, వినోద్‌ లను బౌన్సర్లు కిడ్నాప్ చేశారని తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఘటనలో మోహన్‌బాబు, విష్ణు, యూనివర్సిటీ పీఆర్‌ఓ సతీష్‌ సహా 13మందిపై ఈ నెల 3న కిడ్నాప్ కేసు నమోదైంది. 

 

యూనివర్సిటీ యాజమాన్యం ఆదేశాల మేరకే ఈ కిడ్నాప్ జరిగి ఉండవచ్చని తిరుచానూరు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే A3గా ఉన్న మంచు విష్ణుకు తాజాగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లోగా విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే వ్యక్తిగత కారణాలవల్ల తాను ఈ నెల 15వ తేదీ వరకు అందుబాటులో ఉండనని, ఆ తర్వాత విచారణకు వస్తానని పోలీసులకు విష్ణు సమాధానం ఇచ్చారు. కాగా, ఈ కేసులో A2 గా ఉన్న మోహన్ బాబుకు మాత్రం నోటీసులు అందలేదు. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com