
యష్ అభిమానులంతా టాక్సిక్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో నమోదైన రికార్డులే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. తెలుగు , తమిళం, హిందీ తో పాటు ఇతర భాషల్లో కలిపి అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా ఇప్పటివరకు 60 కోట్ల రూపాయలకు చేరినట్టు ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు.
ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ , ఓవర్సీస్ లో మాత్రం బుకింగ్స్ డల్ గా ఉన్నట్టుగా టాక్ .ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఫైనల్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రీ సేల్స్ ద్వారా 4 లక్షల 70 వేల గ్రాస్ వసూళ్లు వచ్చాయని, అందులో కేవలం తెలుగు వర్షన్ నుండి 3 లక్షల డాలర్లు అని, తమిళం నుండి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క టికెట్ కూడా అమ్ముడుపోలేదని అంటున్నారు. అంటే గ్రాస్ సున్నా అన్నమాట. దీన్ని బట్టీ అర్థం అవుతుంది ఏమిటంటే , తమిళ ఆడియన్స్ కేవలం వాళ్ళ సినిమాలను మాత్రమే చూస్తారు, ఇతర భాషలకు సంబంధించిన వాళ్ళ సినిమాలు చూడరు.
Also Read: మోహన్ బాబుకి భారీ కానుక ఇచ్చిన విష్ణు.. పద్మిని మళ్ళీ రోడ్ మీదకి
కానీ వాళ్ళు మాత్రం అన్ని భాషల్లోనూ తమ సినిమాలను విడుదల చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఆడియన్స్ ప్రోత్సహిస్తున్నారు కూడా. అయితే టాక్సిక్ చిత్రానికి తమిళ వెర్షన్ లో జీరో టికెట్స్ అమ్ముడుపోవడం పై సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ట్రోల్స్ నడుస్తున్నాయి.
Yash, Toxic, Geethu MohanDas






