Home

»

Latest News

దర్శన్ కి ఎదురుదెబ్బ.. అప్రూవర్ గా మారిన కీలక వ్యక్తి 

Aug 25, 2026 6:06PM


కన్నడ సినీ పరిశ్రమని కుదిపేసిన రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న  హీరో దర్శన్ కి కోర్టులో ఊహించని భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ సంచలనాత్మక హత్య కేసులో 14వ నిందితుడిగా ఉన్న ప్రదోష్ (Pradosh) ప్రభుత్వ సాక్షిగా, అంటే అప్రూవర్‌గా (Approver) మారేందుకు కోర్టు అనుమతించింది. ప్రదోష్ సమర్పించిన పిటిషన్‌ను విచారించిన బెంగళూరులోని 59వ అదనపు సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు, ప్రాసిక్యూషన్ ప్రకటనలు మరియు వాదనలు విన్న తర్వాత ఆయన అభ్యర్థనకి  ఆమోదం తెలిపింది. 

దీంతో కేసులో పూర్తి సత్యాన్ని బయటపెట్టి, నిందితుల పాత్ర గురించి సమగ్ర వివరాలను కోర్టుకు వెల్లడిస్తే చట్టపరమైన క్షమాభిక్ష లభించే అవకాశం ఉంది.  ఈ కేసు నేపథ్యాన్ని పరిశీలిస్తే, 2024 జూన్ 8వ తేదీన చిత్రదుర్గానికి చెందిన 33 ఏళ్ల రేణుకాస్వామి అనే ఫార్మసీ ఉద్యోగి దారుణంగా అపహరణకు గురై హత్యకు గురయ్యాడు. నటుడు దర్శన్ భాగస్వామి మరియు నటి అయిన పవిత్ర గౌడకు సోషల్ మీడియా ద్వారా అభ్యంతరకర సందేశాలు పంపాడనే ఆగ్రహంతోనే రేణుకాస్వామిని అపహరించి బెంగళూరులోని షెడ్‌కు తరలించారని పోలీసులు తమ ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ఆ తర్వాత 2024 జూన్ 9న బెంగళూరులోని సుమనహళ్లిలోని ఒక మురికికాల్వ సమీపంలో రేణుకాస్వామి మృతదేహం తీవ్ర గాయాలతో లభ్యమైంది.  

Also Read: టాక్సిక్ కి షాక్ ..ఆ ఏరియాలో ఒక్క టికెట్ అమ్ముడుపోలేదు!

తదనంతరం జూన్ 11న మైసూరులోని ఒక హోటల్ సమీపంలో ఉన్న జిమ్‌లో ఉన్న నటుడు దర్శన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. దర్శన్‌తో పాటు పవిత్ర గౌడ, ప్రదోష్ సహా మొత్తం 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు కూడా విచారణను వేగవంతం చేయాలని ఆదేశిస్తూ, 60 మంది కీలక సాక్షులను ప్రాధాన్య ప్రాతిపదికన విచారించాలని స్పష్టం చేసింది. దర్శన్ జైలులో ఉన్న విషయం తెలిసిందే.

Darshan, sandilWood

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com