
-హీరోలకి ధీటుగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలు
- దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ
-మరి టాప్ లో ఆ ఉన్న ఆ చిత్రాలేంటో చూద్దాం
ఒకప్పుడు స్టార్ హీరోల చిత్రాలకి వసూళ్ల సునామీ వచ్చేది. కానీ కాలంతో పాటు ప్రేక్షకుడి ఆలోచనా విధానం కూడా మారింది. కథలో బలం ఉండి, నాయిక ప్రాధాన్యమున్న పాత్రల చుట్టూ కథ తిరిగితే థియేటర్లకు జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ మధ్య కాలంలో సౌత్ ఇండియాలో మహిళా ప్రాధాన్యత కలిగిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. హీరోలతో సమానంగా స్టార్ హీరోయిన్లు తమ భుజాలపై సినిమాలను మోస్తూ వందల కోట్ల వసూళ్లని సాధిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన మొదటి 7 సౌత్ ఇండియన్ ఉమెన్-లెడ్ చిత్రాల జాబితాను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.
ఈ అరుదైన జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన మూవీ 'లోకా'. మలయాళంలో తెరకెక్కి పాన్ ఇండియా వ్యాప్తంగా 302 కోట్ల గ్రాస్ వసూళ్లతో సౌత్ ఇండియన్ ఉమెన్ లెడ్ చిత్రాల్లో ఆల్‌టైమ్ నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. కైవసం చేసుకోవడమే కాదు లేడీ ఓరియెంటెడ్ సినిమాల మార్కెట్ పరిధిని హీరోలకి ధీటుగా నిలబెట్టింది. ఇక ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిచిన క్లాసిక్ బయోపిక్ 'మహానటి'. సావిత్రి గారి జీవిత కథ ఆధారంగా కీర్తి సురేష్ టైటిల్ రోల్ లో 'నాగ్ అశ్విన్' తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 85 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి ఎప్పటికీ నిలిచిపోయే మైలురాయిగా మారింది.
Also read: తాళి కట్టు, హిట్ పట్టు.. లెనిన్ తో మరోసారి నిజమైన సెంటిమెంట్
రీసెంట్ గా సమంత తన వన్ వుమెన్ యాక్షన్ డ్రామా 'మా ఇంటి బంగారం' తో బాక్సాఫీస్ వద్ద సరికొత్త ఫిగర్స్ నమోదు చేస్తుంది. 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి టాప్ సౌత్ ఇండియన్ ఉమెన్ లెడ్ జాబితాలో మూడవ స్థానాన్ని సొంతం చేసుకుంది. నాలుగో స్థానంలో 81 కోట్ల గ్రాస్ తో అనుష్క నుంచి వచ్చిన చారిత్రాత్మక చిత్రం 'రుద్రమదేవి', ఐదు, ఆరు స్థానాలలో కూడా అనుష్క నుంచే వచ్చిన 'అరుంధతి' 68 కోట్ల గ్రాస్ వసూళ్లతో ఐదో స్థానం, 'భాగమతి' 65 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో ఆరో స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఇక ఈ ప్రతిష్టాత్మకమైన టాప్ 7 జాబితాలో చివరిగా నిలిచిన మూవీ 'సూక్ష్మదర్శిని'. మలయాళంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా. 54 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఏడో స్థానాన్ని దక్కించుకుంది. ఈ కలెక్షన్ల గణాంకాలను బట్టి చూస్తే, సౌత్ ఇండస్ట్రీలో మహిళా ప్రధాన చిత్రాల హవా ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.






