Home

»

Latest News

మా మధ్య గొడవలు పెట్టారు.. ఇప్పుడు వాళ్ళ కళ్ళు చల్లబడతాయి

Jul 13, 2026 12:09PM

 

పాటకి అమృతతత్వాన్ని అందించిన లెజండ్రీ గాయనీమణులు పి. సుశీల(p Susheela)జానకి(S janaki).. పాట ఆ ఇద్దరి కోసం పుట్టిందనే పదాన్ని చెప్పుకోవడానికి కూడా గర్వాన్ని కల్పించిన వాళ్ళు. జానకి గారు మొన్న  పాటని, అభిమానులని విడిచి విడిచివెళ్లిన తరుణంలో, ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ పీ. సుశీల గారు మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరి గుండెలని కదిలిస్తున్నాయి. వీరిద్దరి మధ్య ఉన్నది కేవలం వృత్తిపరమైన పోటీ మాత్రమే కాదు, అంతకుమించిన అమూల్యమైన స్నేహం, సోదరభావం అని సుశీల గారి ఎమోషనల్ స్పీచ్ స్పష్టం చేస్తోంది. సినిమా ఇండస్ట్రీలో ఒకే కాలంలో ఇద్దరు అగ్ర గాయనీమణులుగా రాణించడం, 40 వేలకు పైగా పాటలతో శ్రోతలని  అలరించడం ఒక ఎత్తైతే, ఒకరిపై ఒకరు చూపించుకున్న అమితమైన గౌరవం మరొక ఎత్తు.  

సుశీల గారు తన ప్రసంగంలో జానకమ్మ కంఠాన్ని, ఆమె ప్రతిభను ఆకాశానికెత్తారు. "జానకిలాగా ఏ భావాన్ని అయినా పలకడం ఎవరికీ సాధ్యం కాదు. ఆమె పాట పాడుతుంటే ఒక చిన్న పిల్లవాడి అమాయకత్వం నుండి, అమ్మ ప్రేమ వరకు అన్ని రకాల హావభావాలు స్వరంలోనే కనిపిస్తాయి" అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఒకప్పుడు రికార్డింగ్ థియేటర్లలో గంటల తరబడి గడిపిన రోజులను, ఇద్దరూ కలిసి పంచుకున్న నవ్వులను గుర్తుచేసుకుంటూ ఆమె గొంతు రుద్ధమైంది. సాధారణంగా సమకాలీన కళాకారుల మధ్య ఈర్ష్యాద్వేషాలు ఉంటాయనే అపోహలను పటాపంచలు చేస్తూ, జానకి కంటే గొప్పగా ఎవరూ పాడలేరని సుశీల గారు ముక్తకంఠంతో కొనియాడడం ఆమె సంస్కారానికి నిదర్శనం.  ఆరు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో 18 కి పైగా భాషల్లో వేలాది గీతాలను ఆలపించిన ఈ ఇద్దరు లెజెండ్స్, తెలుగు సినిమా స్వర్ణయుగానికి రెండు కళ్లుగా నిలిచారు. పీ. సుశీల గారు తన కెరీర్‌లో సాధించిన 5 జాతీయ అవార్డులు, జానకమ్మ అందుకున్న 4 జాతీయ అవార్డుల గణాంకాలు వారి ప్రతిభకు అద్దం పడతాయి. అయితే ఈ అవార్డుల కంటే కూడా ఒకరి పట్ల ఒకరికి ఉన్న నిరుపమానమైన ప్రేమే గొప్పదని ఈ భావోద్వేగ వీడియో నిరూపిస్తోంది. సుశీల గారు మాట్లాడుతూ, జానకి భౌతికంగా దూరమైనా ఆమె పాడిన 48,000 కు పైగా పాటల రూపంలో ఎప్పటికీ అమరురాలై ఉంటుందని, దక్షిణాది సంగీత సామ్రాజ్యంలో ఆ స్వర మధురిమలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. ఈ అపూర్వ స్నేహ బంధం నేటి తరానికి ఎంతో ఆదర్శప్రాయం.


  


google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com